క‌రోనా వైర‌స్ లేదా కోవిడ్‌-19.. ఇప్పుడు ఎక్క‌డ చూసినా ఇదే మాట‌.. ఇదే భ‌యం క‌నిపిస్తోంది. ఈ మ‌హ‌మ్మారి కరోనా మొట్టమొదట చైనా లోని హుబై ప్రావిన్స్ యొక్క రాజధాని అయిన వూహాన్ పట్టణంలో అంతుచిక్కని సామూహిక న్యుమోనియాగా నమోదు అయ్యింది. అయితే ఇది క‌రోనా అని గుర్తించేలోపే ప‌రిస్థితి చేజారిపోయింది. ఆ రోజు నుండి ప్రతి రోజు ఒకటి నుండి ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతూ వచ్చాయి. ఆ త‌ర్వాత ప్ర‌పంచ‌దేశాల‌ను ఏ రేంజ్‌లో అంత‌లాకుతులం చేసింది.. చేస్తుందో.. చూస్తూనే ఉన్నాం.

 

భార‌త్‌లో సైతం క‌రోనా రోజురోజుకు విజృంభిస్తుంది. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,663కు చేరగా, 50 మంది ఈ వైరస్‌ బారిన పడి మృతి చెందారు. 150 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. అయితే దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన‌ప్ప‌టికీ క‌రోనా వ్యాప్తి పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా గత రెండ్రోజుల నుంచి కరోనా పాజిటివ్ కేసులు దేశంలో వందల కొద్దీ నమోదవుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఢిల్లీలో జరిగిన ప్రార్థనలు, సదస్సేనని అనుకుంటున్నారు. అదే నిజమైతే మున్ముందు కూడా మరిన్ని కేసులు పెరిగే ప్రమాదం ఉంది. 

 

దీనిని బ‌ట్టీ చూస్తుంటే భార‌త్‌లో కరోనా వైరస్ కేసులపై కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలకు కంట్రోల్ లేకుండా పోయింది. ఈ క్ర‌మంలోనే ఈ 14 రోజుల లాక్‌డౌన్‌లో కరోనా కంట్రోల్ కాకపోతే నెక్ట్స్ ఏంటి? అన్న ప్ర‌శ్న తెర‌పైకి వ‌చ్చింది. చైనాలో ఇలాగే కంట్రోల్ తప్పినప్పుడు ఆ దేశం మొత్తం దృష్టంతా వుహాన్ నగరం, దాని చుట్టూ ఉన్న హ్యూబే ప్రావిన్స్‌పై పెట్టింది. అలాగే అక్క‌డ ప్ర‌జ‌ల‌కు లాక్‌డౌన్ విధించి.. బయటివారు లోపలికి, లోపలి వారు బయటకు వెళ్లకుండా చేసింది. ఆ తర్వాత... లోపలి ఉన్న కోటి మందికి పైగా జనాభాకి టెస్టులు జరిపించింది.

 

ఇలా ప్ర‌తివారం అక్క‌డ వారంద‌రినీ ప‌రీక్ష‌లు చేయ‌డంతో..  చైనాలో ఈ వ్యాధి పూర్తిగా కంట్రోల్ అయ్యింది. అయితే ఇప్ప‌డు భార‌త్ కూడా అదే చేస్తే బెట‌ర్ అంటున్నారు నిపుణులు. అంటే.. దేశంలోని 130 కోట్ల మందికీ టెస్టులు చెయ్యించడమే సరైన పరిష్కారం అంటున్నారు. ఇలా అందరికీ టెస్టులు చేస్తే... కచ్చితంగా కరోనా ఉన్న వారందర్నీ క్వారంటైన్ చెయ్యవచ్చనీ, తద్వారా క‌రోనాకు చెక్ పెట్ట‌వ‌చ్చ‌ని అంటున్నారు. అయితే ఇది అంత సులువైన ప్ర‌క్రియ కాక‌పోయినా.. ఇదొక్క‌టే మార్గం అంటున్నారు. మ‌రి కేంద్రం దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple


 

మరింత సమాచారం తెలుసుకోండి: