తెలుగురాష్ట్రాల్లో ఢిల్లీ పెట్టిన చిచ్చు మామూలుగా లేదు. మత ప్రార్ధనలకు తెలుగు రాష్ట్రాల నుండి సుమారు 2500 మంది వెళ్ళొచ్చారు. వెళ్ళినపుడు ఏ సమస్యా లేకపోయినా తిరిగొచ్చేటప్పటికి కరోనా వైరస్ సమస్య  చాలా పెద్ద ప్రాబ్లెమ్ అయిపోయింది. పైగా ఢిల్లీకి వెళ్ళి వచ్చిన వారిలో కొందరికి వైరస్ సోకిందనే విషయం నిర్ధారణ అవుతుండటంతో ప్రభుత్వాల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఢిల్లీ నుండి తిరిగి వచ్చిన వారిలో కనీసం 200 మంది పరీక్షలు చేయించుకోకుండా బయటే తిరుగుతున్నారు.

 

సరే ఇటువంటి వాళ్ళ సమస్య ఒకటైతే తిరగొచ్చిన వారు ఇతరుల్లో తిరగటం మరో సమస్య అయిపోయింది. ఇందులో భాగంగానే తెలంగాణా జనగామ జిల్లాలోని నెర్మెట్ట మండలం, వెల్డండ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వల్ల మరో సమస్య వచ్చిపడింది. ఢిల్లీకి వెళ్ళిన ఈ వ్యక్తి మార్చి 28వ తేదీన తిరిగొచ్చాడు. ఇతన తన గ్రామంలో మటన్ షాపు నడుపుతుంటాడట.

 

ఢిల్లీ నుండి తిరిగొచ్చిన తర్వాత యధావిధిగా 29వ తేదీన ఉదయం మేకలను కోసి 30 మందికి మాంసాన్ని అమ్మాడు. అలాగే ఆ తర్వాత గ్రామంలో యధేచ్చగా తిరిగాడు. ఢిల్లీకి వెళ్ళి వచ్చిన వాళ్ళ జాబితా ప్రకారం అందరినీ ప్రభుత్వం క్వారంటైన్ సెంటర్ కు తరలిస్తోంది. ఇందులో భాగంగానే పై గ్రామానికి వచ్చిన అధికారులు పై యువకుడితో పా టు అతని కుటుంబసభ్యులను  కూడా ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం గ్రామంలో వెలుగు చూడటంతో మొత్తం టెన్షన్ పెరిగిపోతోంది.

 

ఈ యువకుడి దగ్గర మటన్ కొనుగోలు చేసిన వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబసభ్యులను కూడా అధికారులు గుర్తించి వెంటనే క్వారంటైన్ సెంటర్లకు తరలిస్తున్నారు. దాంతో మాంసాన్ని కొనుగోలు చేసిన 30 మంది తర్వాత ఎక్కడెక్కడ తిరిగారు ? ఎవరెవరిని కలిశారు ? అనే విషయాలపై అధికారులు ఆరాలు తీస్తున్నారు. మొత్తానికి ఢిల్లీ పెట్టిన చిచ్చు మామూలుగా లేదు.

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: