ఒకవైపు కరోనా దేశంలో రోజురోజుకి విజృంభిస్తుంది. దీనితో దేశంలో ఒకరకంగా దేశ పురుగోతికి ఒకింత కుంటూ పడిందని చెప్పవచ్చు. అయినా ఇలాంటి సమయాల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రము లోని నిరుద్యోగులకు ఒక శుభవార్త వచ్చింది. ఇక పూర్తి వివరాలలోకి వెళితే విశాఖపట్నంలోని "హిందుస్తాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్" ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ లో డిజైనర్, జూనియర్ సూపర్‌ వైజర్, ఆఫీస్ అసిస్టెంట్ లాంటి పోస్టుల్ని హిందుస్తాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ భర్తీ చేయబోతుంది. నిజానికి నిరుద్యోగులకు ఒక వరమని చెప్పవచ్చు.

 


ఈ నోటిఫికేషన్ కి గాను మొత్తం 51 ఖాళీలు ఉండగా అనుదులో డిజైనర్ గ్రేడ్-IV (మెకానికల్)- 10 పోస్టులు, డిజైనర్ గ్రేడ్ - IV (ఎలక్ట్రికల్) - 03 పోస్టులు, జూనియర్ సూపర్‌వైజర్ గ్రేడ్ - III (మెకానికల్) - 07 పోస్టులు, జూనియర్ సూపర్‌వైజర్ గ్రేడ్ - III (ఎలక్ట్రికల్) - 09 పోస్టులు, జూనియర్ సూపర్‌వైజర్ గ్రేడ్ - III (సివిల్) - 07 పోస్టులు, ఆఫీస్ అసిస్టెంట్ (సెక్రెటేరియల్) గ్రేడ్ - V- 09 పోస్టులు, జూనియర్ ఫైర్ ఇన్‌స్పెక్టర్ గ్రేడ్ - IV- 04 పోస్టులు, డ్రైవర్ గ్రేడ్ V- 02 పోస్టులు ఇందులో ఉన్నాయి.

 

 


ఇంకా ఈ ఉద్యోగాలకి సంబంధిత కోర్సుల్లో డిప్లొమా, గ్రాడ్యుయేట్ పాసైనవారు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతలకు సంబంధించిన పూర్తి వివరాల కొరకు పూర్తి నోటిఫికేషన్ ని చూడండి. ఈ నోటిఫికేషన్‌ కు సంబంధించిన మరి కొన్ని, పూర్తి వివరాలను https://www.hslvizag.in/ వెబ్‌ సైట్‌ లో మనం తెలుసుకోవచ్చు. అయితే ఈ ఉద్యోగాలకి దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. 2020 ఏప్రిల్ 7 నాడు లోపు అప్లై చేసుకోవాలి. 

 

 


అయితే ఇక్కడ ఆన్‌ లైన్‌ లో దరఖాస్తుని పూర్తి చేసుకొని ప్రింట్ తీసి, అవసరమైన డాక్యుమెంట్స్ మాత్రం జతచేసి నోటిఫికేషన్‌ లో ఇచ్చిన అడ్రస్‌ కు ఏప్రిల్ 14, 2020 లోగా అప్లికేషన్ ఫామ్ అందించాలి. ఇందుకు గాను దరఖాస్తు ఫీజు రూ.200 మాత్రమే. అలాగే ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు ఎటువంటి ఫీజు లేదు. ఈ దరఖాస్తులను పంపాల్సిన అడ్రస్: జనరల్ మేనేజర్ (HR) A.C., హిందూస్తాన్ షిప్ యార్డ్ లిమిటెడ్., గాంధీగ్రామ్ (PO), విశాఖపట్నం. 

మరింత సమాచారం తెలుసుకోండి: