ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు కూడా కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో అయితే గత24 గంటల్లో 43 కరోనా కేసులు బయటపడటం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 87 గా ఉంది. తెలంగాణాలో కరోనా కేసుల సంఖ్య 97 గా ఉంది. భారత దేశ వ్యాప్తంగా 1700 కి చేరువలో కరోనా కేసులు ఉన్నాయి. 

 

ప్రపంచ వ్యాప్తంగా 860,106 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 42,344 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 639,324 మంది కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నారు. ఇక అమెరికాలో ఒక లక్షా 90 వేలకు చేరువలో కరోనా కేసులు ఉన్నాయి. 105,792 మంది ఇటలీలో కరోనా బారిన పడ్డారు. దాదాపుగా 11 వేల మంది అక్కడ ప్రాణాలు కోల్పోయారు. స్పెయిన్, జర్మని లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. 

 

ఆంధ్రప్రదేశ్ లో కరోనా అక్కడి ప్రభుత్వాన్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. నేడు అత్యధికంగా కడపలో 15 కేసులు నమోదయ్యాయి. అలాగే పశ్చిమ గోదావరిలో 13 కేసులు, చిత్తూరులో 5, ప్రకాశం 4, నెల్లూరు 2, తూర్పు గోదావరిలో 2, కృష్ణా 1, విశాఖ 1 కేసు.. మొత్తంగా నేడు ఒక్కరోజే 43 కేసులు నమోదయ్యాయి. ఇక కర్ణాటకలో 101 మందికి కరోనా సోకగా దేశ వ్యాప్తంగా కరోనా కారణంగా 50 మంది ప్రాణాలు కోల్పోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: