క‌రోనా.. మూడు అక్షరాలే అయినా ముచ్చెటమలు పట్టిస్తోంది. గతేడాది డిసెంబరులో చైనాలోని వుహాన్ నగరంలో బ‌య‌ట‌ప‌డ్డ ఈ కొత్తరకం కరోనా వైరస్.. ప్రస్తుతం ప్రపంచదేశాల‌ను క‌మ్మేసింది. దీంతో క‌రోనా క‌ట్ట‌డి చేసేందుకు ఆయా దేశాలు లాక్‌డౌన్ విధించాయి. క‌రోనాకు మందు లేక‌పోవ‌డంతో.. నివారణ పైనే అన్ని దేశాలు ఫోకస్ చేశాయి. వైరస్ సోకకుండా ఉండేందుకు.. సోకిన తర్వాత ఇతరులకు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వాలు కీలక సలహాలు,సూచనలు చేస్తున్నాయి. ముఖ్యంగా కరోనా లక్షణాలు బయటపడితే.. వెంటనే ఆసుపత్రికి రావాలని సూచిస్తున్నాయి.  ఇందుకూ భార‌త్ కూడా మిన‌హాయింపు కాదు. 

 

కారోనాను క‌ట్ట‌డి చేయ‌డానికి భార‌త్‌లో సైతం లాక్‌డౌన్ అమ‌లు అవుతోంది. దీంతో జనజీనం స్తంభించింది. ప్ర‌స్తుతం క‌రోనా భారత్‌లో చాపకింద నీరులా వ్యాపిస్తుండటంతో బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దేశంలో ఇప్పటి వరకు 1,663 క‌రోనా కేసులు న‌యోదు కాగా, 50 మంది ఈ వైరస్‌ బారిన పడి మృతి చెందారు. 150 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉంటే.. లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో ప్ర‌జ‌లంద‌రూ ఇంటికే ప‌రిమితం అయ్యారు. అయితే ఇక్క‌డ మ‌హిళ‌ల‌కు చిక్కొచ్చి పడింది. 

 

లాక్ డౌన్ నుంచి చాలా మంది మహిళలు కరోనా బారి నుంచి బయటపడినా... గృహ హింస నుంచి మాత్రం తప్పించుకోలేకపోతున్నారు. ప్ర‌స్తుతం లాక్‌డౌన్ కార‌ణంగా మ‌గ‌వాళ్లు ఇంట్లో ఉంటున్నారు. ఈ క్ర‌మంలోనే. తమ అసహనాన్ని మొత్తం భార్యలపై చూపిస్తుండటం గమనార్హం. గత పది రోజులకు గృహ హింసలు పెరుగుతున్నాయని నిపుణులు తాజాగా వెల్ల‌డించారు. ఇందులో భాగంగా మార్చి 24వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులోకి వచ్చింది. అప్పటి నుంచి వారం వ్యవధిలో జాతీయ మహిళా కమిషన్ కి మొత్తం 58 గృహ హింస కు సంబంధించి ఫిర్యాదులు రావ‌డం గ‌మ‌నార్హం. ముఖ్యంగా ఇలాంటి కేసులు పంజాబ్ నుంచి ఎక్క‌వ‌గా వ‌స్తున్న‌ట్టు తెలుస్తోంది.   

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: