ఆంద్రప్రదేశ్ భద్రాచలం అంటే అందరు చెప్పే ఒకే ఒక్క దేవాలయం ఒంటిమిట్టలో కొలువై ఉన్న శ్రీ కోదండ రామస్వామి దేవాలయం.. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ దేవాలయానికి  ఎన్నో  మహిమలు కూడా కలిగి ఉంది. ఈ దేవాలయానికి  ప్రతి సంవత్సరం ఏప్రిల్ మాసంలో ఈ స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అయితే ఈ నెలలోనే జరుగుతాయి. ఆ బ్రహోత్సవాలను ఎలా చేస్తారు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..  

 

 

ఏప్రిల్‌ 13 నుంచి 22 వరకు ఒంటిమిట్ట శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించునున్నట్టు తెలిపారు. ఏప్రిల్‌ 13న వృషభలగ్నంలో ధ్వజారోహణంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయని తెలియజేశారు. అదే రోజు సాయంత్రం పోతన జయంతి నిర్వహిస్తామని అన్నారు. ఇక, ఏప్రిల్‌ 16న హనుమంత వాహనం, ఏప్రిల్‌ 18న సీతారాముల కల్యాణం, ఏప్రిల్‌ 19న రథోత్సవం, ఏప్రిల్‌ 21న చక్రస్నానం, ఏప్రిల్‌ 22న పుష్పయాగం ఉంటాయని వెల్లడించారు.

 

 


స్వామివారి కల్యాణాన్ని వీక్షించేందుకు విశేష సంఖ్యలో విచ్చేసే భక్తులకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆలయంలో జరుగుతోన్న ఇంజినీరింగ్‌ పనులను సకాలంలో పూర్తి చేస్తామని వెల్లడించారు. అలాగే స్థానికుల కోరిక మేరకు శ్రీవారి లడ్డూలను ఒంటిమిట్టలో విక్రయించనున్నారు. మొదటి శనివారం 2 వేలు, నాలుగో శనివారం 2 వేల లడ్డూలు మొత్తం 4 వేల లడ్డూలను ప్రతి నెలా విక్రయించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడి దేవాలయ ప్రత్యేకతల్లో ముఖ్యంగా చెప్పుకొనేది మాత్రం రథోత్సవం.. 

 

 


కల్యాణ మహోత్సవానికి మూడురోజుల తర్వాత జరిగే పాన్పు సేవ బ్రహ్మోత్సవాల్లో హైలెట్ గా నిలుస్తుంది. ఈ సేవనే ఏకాంత సేవ అంటారు. స్వామివారి సీత అమ్మవారితో ఏకాంతంగా గడుపుతున్నట్లు అక్కడ ఆలయ అధికారులు ఏర్పాటు చేస్తారు. ఆ సేవను చూడటానికి భక్తులు భారీ సంఖ్యలో పాల్గొంటున్నారు. ఈ రోజు స్వామివారి తరంబ్రాలు అంటే ముత్యాలు మహిళలకు కానుకగా ఇస్తారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: