ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కరోనా మహమ్మారి ధాటికి ప్రపంచం చిగురుటాకులా వణికిపోతున్నాయి. అన్ని దేశాలకు కరోనా వైరస్ అత్యంత వేగంగా విస్తరించింది. దీన్ని కట్టడి చేయడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా సరే సాధ్యం కాని పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 9 లక్షల కరోనా కేసులు నమోదు అయ్యాయి. 

 

42 వేల మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ వ్యాప్తంగా అధికారిక లెక్కల ప్రకారం 860,184 మందికి కరోనా సోకింది. 42,345 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 178,468 మంది కరోనా నుంచి బయటపడ్డారు. అగ్ర రాజ్యం అమెరికాలో కరోనా 188,592 మందికి సోకింది. 105,792 మందికి ఇటలీలో కరోనా వైరస్ సోకింది. ఇక స్పెయిన్ లో క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. 

 

ఇక మన దేశంలో కరోనా కేసుల సంఖ్య అత్యంత వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు మన దేశంలో 1700 మందికి కరోనా వైరస్ సోకింది. దీనితో ఇప్పుడు ప్రభుత్వాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు 87 కి దగ్గరలో ఉన్నాయి. తెలంగాణాలో కరోనా కేసుల సంఖ్యా సెంచరి కి దగ్గరగా ఉంది. ఈ సంఖ్య మరో రెండు రోజుల్లో భారీగా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: