కరోనా ని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం 21 రోజులపాటు లాక్ డౌన్ విధించిన సంగతి అందరికీ తెలిసినదే. ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుండగా ఇంకా పొడిగించే అవకాశం ఉన్నట్టు వస్తున్న వార్తలను ఇటీవల కేంద్రం ఖండించింది. ప్రస్తుతానికి అయితే లాక్ డౌన్ పొడిగించే అవకాశం లేదని కరాఖండిగా చెప్పేసింది. ఇటువంటి నేపథ్యంలో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం అత్యంత తక్కువ భూభాగంలో జనాలు బతుకుతున్న దేశంగా భారత్ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ మహమ్మారి వైరస్ ని కట్టడి చేయాలంటే 21 రోజుల పాటు లాక్ డౌన్ సరిపోదని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు తేల్చిచెప్పారు.

 

ఐదు రోజుల సడలింపులతో మూడు లాక్ డౌన్లు అవసరమని పేర్కొన్నారు. వర్సిటీలోని అప్లైడ్ మేథమేటిక్స్ అండ్ థియరేటికల్ ఫిజిక్స్ విభాగానికి చెందిన భారత సంతతి పరిశోధకులు రాజేశ్ సింగ్, ఆర్.అధికారి దీనిపై విస్తృత పరిశోధనలు చేసి ఈ మేరకు నిర్ధారణకు వచ్చారు. భారత్ లో పూర్తిగా ఈ ప్రమాదకరమైన వైరస్ ని తరిమి కొట్టాలంటే మూడు లాక్ డౌన్స్ విధించాల్సి ఉంటుందని యూనివర్సిటీ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం 21 రోజుల తర్వాత 28 రోజులు అదేవిధంగా చివరిగా 18 రోజులు మూడు లాక్ డౌన్స్ విధిస్తే భారత్ లో కరోనా వైరస్ ప్రభావం ఏమాత్రం ఉండదని యూనివర్సిటీ చెప్పుకొచ్చింది.

 

చాలా తక్కువ ప్రదేశంలో ఎక్కువ ప్రజలు కలిగిన దేశం కాబట్టి కచ్చితంగా మూడు లాక్ డౌన్స్ పాటించాలని ఏ మాత్రం వైరస్ విస్తరించిన ప్రపంచ పటంలో భారతదేశం కనుమరుగవడం గ్యారెంటీ అని యూనివర్సిటీ పరిశోధకులు తెలియజేస్తున్నారు. మొత్తంమీద జూన్ వరకు లాక్ డౌన్ ఇండియాలో కొనసాగించాలని టాప్ మోస్ట్ సీక్రెట్ వార్తలు ఇటీవల బయటపడుతున్నాయి. మరి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: