అజిత్ ధోవాల్ ఈ పేరు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  మనం ఎన్నో సినిమాల్లో గుఢాచారులను చూస్తుంటాం.. ప్రాణాలకు తెగించి శత్రువులకు చిక్కకుండా ఆ దేశ రహస్యాలు తెలుసుకోవడం.. వాళ్లు మన దేశానికి ఏదైనా ముప్పు కల్పిస్తే వాటిని మన దేశానికి చేరవేయడం చేస్తుంటారు.  జేమ్స్ బాండ్ తరహాలో ఈ చిత్రలకు ఎంతో ఆదరణ లభిస్తుంది.  అయితే ఇండియన్ జేమ్స్ బాండ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు అజిత్ కుమార్ ధోవాల్.  

 

2004-05 కాలంలో ఇంటిలిజెన్స్ బ్యూరోకు డైరెక్టర్ గా పనిచేశారు, అంతకు ముందు దాదాపుగా దశాబ్ది కాలం ఆ సంస్థ కార్యకలాపాల విభాగానికి అధిపతిగా బాధ్యతలు నిర్వర్తించారు.  భారత నిఘా, శాంతిభద్రతల అధికారిగా పనిచేసి, 2014 మే 30 నుంచి 5వ, ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారుగా ప్రధాని నరేంద్ర మోడీకి సేవలందిస్తున్నారు. ఇటీవల ఢిల్లీలొని నిజాముద్దీన్ మార్కజ్ ప్రాంతంలో మతపరమైన ప్రార్ధనలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రార్ధనల్లో పాల్గోన్న విదేశీయులకు కరోనా సోకింది.

 

ఈ ప్రార్దనల్లో చాలా మంది ఇండియాకు సంబంధించిన ముస్లింలు పాల్గోనారు. ఆ పరిసర ప్రాంతాలన్ని అజిత్ ధోవాల్ పరిశీలించారు.  నిన్న జరిగిన అంతర్గత భద్రత సమావేశం తర్వాత  ఆయన రాత్రి 2 గంటల ప్రాంతంలో సందర్శించినట్లు సమాచారం.  కాగా,  నిజాముద్దీన్ మార్కజ్ ప్రాంతాన్ని శానిటైజేషన్ చేశారు ఢిల్లీ మున్సిపల్ అధికారులు.  శానిటైజేషన్ అనంతరం ప్రాంతాన్ని సందర్శించా రు ఢిల్లీ ఆరోగ్యశాఖ అధికారులు.  ఇదిలా ఉంటే నిజాముద్దీన్ మార్కజ్ నుంచి వెళ్లిన వారిని క్వారంటైన్ లో ఉంచుతున్న విషయం తెలిసిందే.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: