ప్ర‌స్తుతం క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌జ‌ల్లో నెల‌కొన్న ఆందోళ‌న‌ల‌ను తొల‌గించేందుకుకానీ, ప్ర‌భుత్వం త‌ర‌ఫున ప్ర‌జ‌ల‌కు క‌ల్పిస్తున్న సౌక‌ర్యాల విష‌యంలో కానీ ప్ర‌భుత్వ వాయిస్‌ను వినిపించ‌డంలోను, ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకు వెళ్ల‌డంలోనూ తెలంగాణ ప్ర‌భుత్వం సంపూర్ణంగా స‌క్సెస్ అయింది. అయితే, ఈ త‌ర‌హా దూకుడు జ‌గ‌న్ స‌ర్కారులో క‌నిపించ‌డం లేద‌నే వాద‌న వినిపిస్తోంది. ఇందులో చాలా వ‌ర‌కు వాస్త‌వం ఉంద‌ని ఏపీ జ‌నాల‌తో పాటు అధికార యంత్రాంగం కూడా ఒప్పేసుకుంటోంది.  గ‌త ప‌దిహేను రోజుల ప‌రిణామాల‌ను ఒక్క సారి ప‌రిశీలించిన ప్ర‌తీ ఒక్క‌రికి ఈ విష‌యం అవ‌గాత‌మ‌వుతుంది. 

 

క‌రోనా వైర‌స్ ఉత్త‌ర‌భార‌తంలో అడుగుపెట్టి..ఆ త‌ర్వాత ద‌క్షిణాభార‌తానికి అంటుకుంది. అయితే వైర‌స్ పాజిటివ్ కేసుల‌న్నీ కూడా విదేశాల నుంచి వారివే కావ‌డం గ‌మ‌నార్హం. మొద‌ట హైద‌రాబాద్‌లో ఒక కేసు న‌మోదుకావ‌డంతోనే రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ వేగంగా స్పందించారు. ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేంద‌ర్‌తో పాటు గాంధీ ఆస్ప‌త్రిలో పూర్తి ప‌ర్య‌వేక్ష‌ణ‌కు కేటాయించారు. ఐసోలేష‌న్ వార్డుల ఏర్పాటు, వైద్య బృందాలనియామం ఇలా ప్ర‌తీ విష‌యంలో ఎంతో ఫార్వ‌ర్డ్‌గా క‌నిపించారు. ఎప్ప‌టిక‌ప్పుడు క‌రోనా ప‌రిణామాల‌పై శాఖ నుంచి నివేదిక‌లు తెప్పించుకుంటూనే ప్ర‌పంచ దేశాల్లో క‌రోనా చ‌ర్య‌లుపై ఆరా తీశారు. అందుక‌నుగునంగానే జ‌న‌తా క‌ర్ఫ్యూకు ముందే రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్‌లో నిషేధాజ్ఞ‌లు అమ‌లయ్యేలా చేశారు. 


అదే స‌మ‌యంలో పొరుగు రాష్ట్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిలో కాస్త జాప్యం క‌నిపించింద‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ఏపీ ప్ర‌భుత్వం, యంత్రాంగం క‌రోనా క‌ట్ట‌డికి ఆల‌స్యంగా  నిర్ణ‌యాలు తీసుకుంటోంద‌న్న ఆరోప‌ణ‌లు విన‌బ‌డుతున్నాయి. నిషేదాజ్ఞ‌ల అమ‌లులోనూ క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించ‌లేక‌పోయార‌ని ప్ర‌జ‌ల్లో నిర‌స‌న మొద‌ల‌వుతోంది. కేసీఆర్‌లో ఉన్న దూకుడు నిర్ణ‌యాలు, ప్ర‌జ‌ల‌కు భ‌రోసా క‌ల్పించ‌డం వంటివి జ‌గ‌న్ చేయ‌లేక‌పోతున్నాడు అనే అప‌వాద‌యితే జ‌నాల్లోకి ఇప్ప‌టికే బాగా వెళ్లింది. మ‌రీ రెండు రోజుల్లో దాదాపు 50కి పైగ ఆకేసులు న‌మోదుకావ‌డంతో ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జానీకంలో ఆందోళ‌న‌లు పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జ‌గ‌న్ ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటారు అనే దానిపై ఉత్కంఠ నెల‌కొంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: