కరోనా వైరస్ ప్రపంచాన్ని చిగురుటాకులా వణికిస్తోంది.. ఈ వైరస్ బారిన ఇప్పటికే 8 లక్షలమందికిపైగా పడ్డారు.. 42 వేలమంది మృతి చెందారు. అలాంటి ఈ కరోనా వైరస్ ఇన్నాళ్లు అమెరికా, ఇటలీ వంటి దేశాల్లోనే కరోనా వైరస్ విజృంభిస్తుంది అనుకుంటే ఈ రెండు రోజుల్లో భారత్ ను కూడా వణికిస్తోంది. కేవలం రెండు రోజుల్లోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

 

అయితే నిజానికి ఈ భారీ కేసులు నమోదవ్వడానికి ఒక కారణం ఉంది. అది ఏంటి అంటే? ఢిల్లీలో మర్కజ్ లో ప్రేయర్స్ చెయ్యడానికి వెళ్లిన వారు ఈ కరోనా బారిన పడ్డారు. అయితే వారంతా ఢిల్లీకి వెళ్లి సైలెంట్ గా ఇళ్లలో ఉండటంతో ఈ దారుణమైన ఘటన చోటు చేసుకుంది.. తెలుగు ప్రజలను వణికిస్తోంది. 

 

అలాంటి ఈ కరోనా వైరస్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్న సమయంలో ప్రభుత్వాలు ఎన్నో కఠిన నిర్ణయాలు.. జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ చాప కింద నీరులా ఈ కేసులు వ్యాపించాయి. అలాంటి ఈ కరోనా పాజిటివ్ కేసులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఆందోళన చెందుతూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నా ఈ సమయంలో కూడా సహకరించడం మానేసి కరోనాను కూడా రాజకీయం చేస్తుంది ప్రతిపక్షం. 

 

నిజానికి ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు ఓ జిత్తులమారినక్క అని రాజకీయ విశ్లేషకులు ఎప్పుడు చెప్తూనే ఉంటారు.. అలాంటి ఈ జిత్తులమారినక్క రాష్ట్రంలో ఎలాంటి ప‌రిస్థితి వ‌చ్చినా సరే త‌న‌దైన శైలిలో త‌న‌కు అనుకూలంగా మార్చుకోవ‌డంలో ముందుంటాడు. ప్ర‌జ‌ల‌కు ఏక‌ష్ట‌మొచ్చినా ఆయ‌న వారి మ‌ధ్య ఉండ‌డం అల‌వాటు చేసుకున్నట్టు నటించి అధికారంలో ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకిస్తుంటారు.

 

పైన పటారం.. లోన లొటారం అన్నట్టు ఉంటుంది చంద్రబాబు శైలి. అతను అధికారంలో ఉండి ఉంటే ఇప్పటికి ఎన్ని అవతారాలు చేసేవాడో.. కరోనా పేరుతో ఎంత నొక్కేసేవారో.. ఇప్పుడు జగన్ ఉన్నాడు కాబట్టి సరిపోయింది లేకుంటే రాష్ట్రాన్ని కరోనాతో నాశనం చేసేవాడు అని అంటున్నారు నెటిజన్లు. 

 

అయితే ప్రస్తుతం సీఎం జగన్ చేస్తున్న తప్పు ఒక్కటే.. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ అయన సైలెంట్ గా చేసుకుంటూ వెళ్తున్నారు.. చంద్రబాబులా డబ్బా కొట్టుకోవడం లేదు.. కానీ సీఎం జగన్ చేసే మంచి పనులు ప్రతి ఒక్కరికి తెలియాలి.. లేకుంటే ఈ ప్రతిపక్షం ఇలానే చేస్తుంది.. అందుకే జగనన్న.. జనంలోకి రా అన్న.. నీ సత్త ఏంటో చూపించు అని వైసీపీ అభిమానులు చెప్తున్నారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: