ప్రపంచం మొత్తం ఇప్పుడు కరోనా వైరస్ భయం పట్టుకుంది.  ఇప్పటికే భారత దేశంలో కరోనా వైరస్ వల్ల రోజు రోజుకీ మరణాలు సంబవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా రోజు రోజుకీ ఇక్కడ కూడా మరణాలు సంఖ్య పెరిగిపోతుంది.  తాజాగా ఏపిలో ఈ తీవ్ర మరింత పెరుగుతుందని అంటున్నారు.  ఆంధ్రప్రదేశ్‌ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య దాదాపుగా డబుల్ అయింది. నిన్న రాత్రి 9 గంటల నుంచి ఈ రోజు ఉదయం 9 గంటల వరకూ 43 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఏకంగా 87కి చేరింది.

 

12 గంటల్లో మొత్తం 373 శాంపిళ్లను పరీక్షించగా, వాటిల్లో 330 నెగిటివ్‌గా తేలింది.  ఏ కోవిడ్-19పై ఉన్నత స్థాయి సమీక్ష ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టారు. క‌రోనాపై పోరులో అధికారుల‌ను, సిబ్బందిని ఎక్క‌డిక‌క్క‌డ క‌ట్టుదిట్టం చేస్తున్న సీఎం జ‌గ‌న్‌.. టెక్నిక‌ల్‌గా హిట్ట‌వుతున్నార‌నే వ్యాఖ్య‌లు వైసీపీ నుంచి వినిపిస్తున్నాయి. అయితే , ప్ర‌స్తుతం నెల‌కొన్న దారుణ ప‌రిస్థితిలో మాత్రం ప్ర‌జ‌ల‌కు కావాల్సింది నైతిక మ‌ద్ద‌తు కూడా! ఇది నాయ‌కుడి వ‌ల్లే సాధ్యం.

 

మ‌రి జ‌గ‌న్ ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు రావ‌డ‌మే లేక నిత్యం మీడియా ద్వారా ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడ‌మో చేయాల‌ని అంటున్నారు.  ఏపిలో కరోరా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు భరోసా ఇవ్వవానికి సీఎం జగన్ రంగంలోకి దిగాలని అప్పుడే ప్రజల్లో ఈ మాయదారి మహమ్మారిపై సరైన అవగాహన వస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 


 

మరింత సమాచారం తెలుసుకోండి: