కరోనా మహమ్మారి వల్ల ప్రపంచం మొత్తం క్షణం క్షణం భయం అనే పరిస్థితిలో బ్రతుకుతోంది. కరోనా వైరస్ సోకడం వల్ల కొంత మంది చనిపోతుంటే, మరికొంత మంది అది తమకు సోకిందేమోనన్న అనుమానంతో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే కరోనా భయంతో చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంకా చేసుకుంటూనే ఉన్నారు. తాజాగా తెలంగాణలో కూడా ఇలాంటి సంఘటన ఒకటి చేసుకుంది. బీటెక్ చదివే ఓ విద్యార్థిని తనకు కరోనా సోకిందన్న భయంతో ఆత్మహత్యకు పాల్పడింది.

 

 

వివరాల్లోకి వెళ్తే, రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో నివసించే దాసరి బాలయ్య, లక్ష్మీ దంపతులు కుమార్తె స్రవంతి. ఆమె సిద్ధిపేట జిల్లాలోని ఇందూరు ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతోంది. స్రవంతి తండ్రి గల్ఫ్‌ దేశంలో పనిచేస్తుండగా, ఆమె తల్లి వ్యవసాయ పనులకు వెళ్తుంది. స్రవంతికి ఒక సోదరుడు ఉన్నాడు. అతను హైదరాబాద్‌లో క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అయితే మంగళవారం ఇంట్లో ఎవ్వరూ లేని సమయం చూసి, స్రవంతి తన ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది.

 

 

స్రవంతి చనిపోయే ముందు ఓ సూసైడ్ నోట్ రాసుకుంది. అందులో ‘నాకు కరోనా లక్షణాలు ఉన్నాయి. కాలేజీకి వెళ్తున్న సమయంలో బస్సులో నా పక్కన కూర్చున్న వారి నుంచి ఈ వ్యాధి నాకు సోకి ఉంటుంది. దాన్ని నా కుటుంబ సభ్యులకు అంటించడం నాకు ఇష్టం లేదు. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా’ అని రాసింది. అయితే స్రవంతి తల్లి మాత్రం తన కూతురుకు ఎటువంటి కరోనా లక్షణాలు లేవని చెబుతోంది. దీంతో స్రవంతి ఆత్మహత్య ఇప్పుడు ఒక మిస్టరీలా మారింది. స్రవంతి నిజంగా కరోనా కారణంగా ఆత్మహత్య చేసుకుందా? లేక ఇంకేమైనా జరిగిందా? అనే విషయాలపై పోలీసులు దృష్టి సారిస్తున్నారు. దీని వెనక ఉన్న రహస్యాన్ని ఛేదించడానికి పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: