సాధారణంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంచి వక్త. ప్రజలకు ఎలా చెప్తే అర్ధమవుతుంది...? ప్రజలు ఏ విధంగా చెప్తే అర్ధం చేసుకుంటారు అనేది ఆయనకు బాగా తెలిసిన విద్య. అలాంటి జగన్ ఇప్పుడు కరోనా వైరస్ విషయంలో మాట్లాడుతున్న మాటలు ప్రజల్లోకి వెళ్ళడం లేదనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. జగన్ కి ప్రజల్లోకి వెళ్ళే విధంగా చెప్పడం అనేది వెన్నతో పెట్టిన విద్య. కాని కరోనా వైరస్ విషయంలో ఆయన దూకుడు ప్రదర్శించడం లేదు. 

 

కరోనా గురించి తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ చేసే వ్యాఖ్యలు ప్రజల్లోకి వెళ్తున్నాయి గాని జగన్ చేసే వ్యాఖ్యలు మాత్రం అంత వేగంగా వెళ్ళడం లేదు. పాదయాత్ర సమయంలో అయినా ఎన్నికల ప్రచారంలో అయినా సరే ఆయన భవిష్యత్తు గురించి చాలా బాగా మాట్లాడారు. తనకు ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ ప్రజల్లోకి వెళ్ళే విధంగా చెప్పారు. కాని ఇప్పుడు కరోనా జాగ్రత్తలు, మంత్రులకు ఆయన ఇచ్చే బాధ్యతలు, అధికారులకు ఇచ్చే ఆదేశాలు ఇవి అన్ని కూడా ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళడం లేదు. కాబట్టి జగన్ ఇప్పుడు రంగంలోకి దిగాలి.  

 

అధికారులు, మంత్రులు మాట్లాడుతున్న మాటలు ప్రజలకు ధైర్యం ఇవ్వడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి జగన్ ప్రజల్లోకి రావాలి. ప్రజలకు ధైర్యం చెప్పాలి, కరోనా గురించి వాళ్లకు వివరించాలి. కరోనా విషయంలో వరుసగా ప్రజలతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని మాట్లాడాలి. ఎవరూ కూడా భయపడకుండా ధైర్యం చెప్పాలి. పాదయాత్రలో ఏ విధంగా అయితే జగన్ అందరిని దగ్గర చేసుకున్నారో ఇప్పుడు కూడా ఇలాగే చెయ్యాలని అంటున్నారు. మంత్రులను, అధికారులను నిద్ర పోనీయకుండా పని చెయ్యాలని సూచిస్తున్నారు. ఇక్కడ చంద్రబాబు ని పొగడటం అని కాదు గాని, ఏదైనా విపత్తు వస్తే చంద్రబాబు ఉరుకులు పరుగులు పెట్టిస్తారు. ఇప్పుడు జగన్ కూడా అలాగే చెయ్యాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: