ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఇప్పుడు ప్రజలకు చుక్కలు చూపిస్తుంది. దీని పేరు వింటే చాలా మంది గుండెల్లో రైళ్ళు పరిగెత్తే పరిస్థితి ఏర్పడింది అనేది వాస్తవం. కరోనా వైరస్ ధాటికి ప్రపంచం ఒక్కసారిగా కుదేలు అయిపోతుంది. ఎం చెయ్యాలో అర్ధం కాక దేశాధినేతలు ఇప్పుడు కన్నీరు మున్నీరు అయ్యే పరిస్థితి ఏర్పడింది అనేది వాస్తవం. కరోనా వైరస్ కి ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 43,269 మంది బలయ్యారు. 

 

ఈ వైరస్ ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 872,481 మందికి సోకింది. వీరిలో 184,482 మందికి కరోనా వైరస్ పూర్తిగా నయం అయింది. 611,279 (95%) మంది బాధితులకు కరోన చికిత్స చేస్తుండగా... 33,451 (5% మంది ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు విషమంగా ఉంది. అగ్ర రాజ్యం అమెరికాలో కరోనా బారిన 188,592 మంది పడ్డారు. వారిలో 4,056 మంది ప్రాణాలు కోల్పోయారు. 7,251 మందికి కరోనా వైరస్ రికవర్ అయింది. 

 

ఇటలీలో కరోనా వైరస్ లక్షా అయిదు వేల మందికి సోకగా దాదాపు 12 వేల మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు స్పెయిన్ లో కూడా కరోనా బాధితుల సంఖ్యా లక్ష దాటింది. 102,136 మందికి అక్కడ కరోనా సోకింది. 9,053 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మరి కొంత మంది ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అంటున్నారు. ఇక మన దేశంలో 1700 కి చేరువలో కరోనా బాధితులు ఉన్నారు. ఫ్రాన్స్, జర్మని లో కూడా కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మన దేశంలో కరోనా కారణంగా 52 మంది ప్రాణాలు కోల్పోయారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

మరింత సమాచారం తెలుసుకోండి: