అవును.. కరోనా వైరస్ తన విశ్వరూపాన్ని చూపిస్తుంది. ఇన్నాళ్లు అమెరికా.. ఇటలీ.. ఇరాన్ వంటి దేశాల్లో కరోనా వైరస్ విలయతాండవం చేసింది.. ఇప్పుడు ఈ కరోనా వైరస్ తన విశ్వరూపాన్ని మన భారత్ లో కూడా చూపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ దేశ రాజధాని ఢిల్లీ నుండి ఈ కరోనా వైరస్ అన్ని రాష్ట్రాలకు వ్యాపించింది. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాలలో కరోనా వైరస్ కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి.. రెండు రోజుల్లో అనుకోని రీతిలో సిన్ మారింది. ఈ సిన్ తో తెలంగాణాలో రాజకీయాలలో ఏలాంటి గోల లేకపోయినప్పటికీ ప్రజలను భయపడుతున్నారు. ఇంకా ఆంధ్రాలో అయితే ప్రజలు భయపడటం కాదు ప్రతిపక్షం భయపెడుతుంది. 

 

నిజం ఏంటి అంటే.. వైసీపీ ప్రభుత్వం ఎన్నో మంచి పనులు చేస్తుంది.. ఎన్నో జాగ్రత్తలు పాటిస్తుంది. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం కేంద్రం కంటే ముందే అలోచించి లాక్ డౌన్ విధించింది. అయినప్పటికీ ఎం చేస్తాం ఏపీని దురదృష్టం వెంటాడింది.. అనుకోకుండా రెండు రోజుల్లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. 

 

ఇదే అదునుగా చూసుకున్న ప్రతిపక్షం ఓ రేంజ్ లో మాట్లాడుతుంది.. వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉండి ఉంటే.. పని తక్కువ ప్రచారం ఎక్కువ అన్నట్టు ఉండేది.. కానీ ఇక్కడా ఉన్నది సీఎం జగన్.. అందుకే వారి ప్రభుత్వం పని చేసినప్పటికీ బయటకు వెల్లడించడం లేదు. ప్రకటనలు చెయ్యడం లేదు.. 

 

అయితే ప్రజలకు ఇప్పుడు దైర్యం చెప్పాల్సియా సమయం కాబట్టి సీఎం జగన్ చేసే పనులు అన్ని కూడా ప్రచారం చెయ్యాలి.. క‌రోనా వైరస్ పై ప్ర‌భుత్వం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటోందో ప్రజలకు చెప్తేనే మంచిది. ప్రజలు భయపడకుండా ఉంటారు. ప్రజలకు నిత్య‌వస‌రాల‌ను పంచుతున్నట్టు ప్రకటించి పంచి మంచే చేశారు.కానీ ప్ర‌భుత్వాధి నేత‌, లేదా కీల‌క నాయ‌కుల నుంచి ప్ర‌జ‌ల‌కు మంచి స‌ల‌హాలు, సూచ‌న‌లు, మేం ఉన్నామ‌నే భ‌రోసా వ‌చ్చిన‌ప్పుడే, ప్ర‌చారం చేసిన‌ప్పుడే ప్రజలు దైర్యంగా ఉంటారు. ఆ దిశగా అలోచించి ప్రజల ముందుకు వచ్చి దైర్యం చెప్పి ప్రతిపక్షాల నోరు మూయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: