దేశంలో కరోనా వైరస్ ప్రభావాన్ని ఎంత కట్టి చేస్తున్నా రోజు రోజుకీ కేసులు పెరిగిపోతున్నాయి.  ఏపిలో మొన్నటి వరకు నివురు గప్పిన నిప్పులా ఉన్నా ఇప్పుడు దీని ప్రభావం మరింత పెరిగిపోతుంది. దాంతో ఆంధ్రప్రజల్లో ఒకరకమైన అపోహలు.. భయం మొదలైంది.  ఈ నేపథ్యంలో ఇప్పుడు సీఎం జగన్ రగంలోకి దిగి ప్రజల్లో చైతన్యం నింపాలని.. గుండె ధైర్యం చెప్పాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.  అయితే కరోనా ప్రభావం ఉందని తెలిసినప్పటి నుంచి మంత్రి పేర్ని నాని ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు.    

 

ప్ర‌స్తుత క‌రోనా క‌ష్ట కాలంలో ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించే మాట్లాడేందుకు వైసీపీలో నాయ‌కులే క‌రువ‌య్యార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఎవ‌రైనా నాయ‌కుడు మీడియా ముందుకు వ‌స్తే.. ఎక్క‌డ ఎలాంటి వివా దాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తారో తెలియ‌దు ఈ నేప‌థ్యంలో వైసీపీ త‌ర‌ఫున మాట్లాడే వారిని సోష‌ల్ మీడియా వెయ్యిక‌ళ్ల‌తో ప‌రిశీలిస్తోంది. తేడాగా మాట్లాడిన వారికి స‌టైర్ల‌తో త‌లంటేస్తున్నారు. అయితే, మంత్రి పేర్ని మాత్రం ఆచితూచి మాట్లాడుతున్నారు.

 

ఎంత వ‌ర‌కు మాట్లాడాలో అంతే మాట్లాడి అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్నారు. మొత్తానికి క‌రోనా ఎఫెక్ట్ స‌మ‌యంలో ప్ర‌భుత్వానికి-ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య పేర్ని అండ‌గా ఉంటున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు కరోనా ఏపిలో మరింత పెరిగిపోయే అవకాశం ఉందన్న అంటున్నారు. ఈ సమయంలో ఇప్పుడు సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజల్లో చైతన్యం నింపాలని.. వారికి మంచి భరోసా ఇవ్వాలని అంటున్నారు.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: