ఏపీలో ఒక్కరోజులో పరిస్థితి మారిపోయింది. ఒక్కరోజులో 43 కరోనా కేసులు నమోదు కావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో ప్రజలు పూర్తిగా ఇళ్లకే పరిమితమయ్యారు. వైరస్ వేగంగా విజృంభిస్తూ ఉండటం... రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటంలో ప్రజలు భయంతో జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వం రాష్ట్ర ప్రజల కోసం పలు చర్యలు చేపట్టినా మరిన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 
ప్రభుత్వం నుంచి ప్రజలకు కరోనా నుంచి భయాందోళనకు గురి కావద్దని భరోసా అందాల్సి ఉంది. ఎన్నికల ముందు సీఎం జగన్ అధికారంలోకి వస్తే ప్రజా సంక్షేమ పాలన అందిస్తానని చెప్పి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారో ఇప్పుడు అదే విధంగా కరోనా కట్టడి కోసం ప్రజల్లో స్పూర్తి నింపాల్సి ఉంది. రాష్ట్రంలో కరోనా కోరలు పీకేందుకు ప్రభుత్వం మరిన్ని ఆస్పత్రుల ఏర్పాటు దిశగా, వెంటిలేటర్ల కొరత లేకుండా ఏర్పాట్లు చేయాల్సి ఉంది. 
 
ఒకవేళ కరోనా సోకినా వారికి, వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని భరోసా కల్పించాల్సి ఉంది. ప్రభుత్వం కరోనా కట్టడి కోసం బాగానే కృషి చేస్తున్నా మరిన్ని చర్యలు చేపడితే బాగుంటుందని ప్రజలు కోరుతున్నారు. నిత్యావసర వస్తువులు, కూరగాయలు ఇంటికే సరఫరా అయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపడితే బాగుంటుందని ప్రజలు సూచిస్తున్నారు. 
 
రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 87కు చేరింది. మరికొన్ని జిల్లాల నివేదికలు ఇంకా అందాల్సి ఉందని తెలుస్తోంది. ఢిల్లీలో మత సదస్సుకు హాజరైన వారే ఎక్కువగా కరోనా భారీన పడుతున్నారని సమాచారం. ప్రభుత్వం వీరిని ఇప్పటికే జల్లెడ పట్టి క్వారంటైన్ కేంద్రాలకు తరలించింది. ఈరోజు రాత్రికి కేసులు మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. నేను ఉన్నాను... నేను విన్నాను... అని జగన్ మరోసారి ప్రజల్లో స్పూర్తి నింపితే బాగుంటుందని ప్రజల నుండి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: