ఢిల్లీ నిజాముద్దీన్ లోని మర్కజ్ మసీదు భవనంలో నిర్వహించిన ప్రార్థన కార్యక్రమాల్లో పాల్గొన్న 369 మంది తమ స్వస్థలమైన ఆంధ్రప్రదేశ్ లోకి అడుగు పెట్టిన వేళ... ఆ రాష్ట్రంలో కేసుల సంఖ్య కొన్ని గంటల్లోనే 43 కు చేరుకుంది. మతపరమైన ప్రార్థనల్లో పాల్గొనడం వలన కడప జిల్లాలో అత్యధికంగా 15 కేసులు నమోదయ్యాయి. దాంతో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా కలవరపడుతున్నారు.



అలాగే కరోనా వైరస్ వ్యాప్తి కి అడ్డుకట్ట వేసేందుకు అనేక చర్యలను తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా దేశ విదేశాల నుండి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన ప్రతి ఒక్కరిని 24x7 పరీక్షించాలని ఆదేశించారు. కరోనా అనుమానితులని గుర్తించేందుకు సమర్థవంతమైన సర్వే కూడా కొనసాగించాలని ఆయన అన్నారు. జగన్మోహన్ రెడ్డి కీలకమైన సమీక్షలు నిర్వహిస్తూ... రాష్ట్రంలో కరోనా ప్రభావం ఎలా ఉందో చాలా బాగా తెలుసుకుంటున్నారు. చదువురాని ప్రజల్లో కూడా కరోనా వైరస్ గురించి పూర్తి అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఆశ్రమము లేక షెల్టర్ లలో తలదాచుకుంటున్న వారికి కూడా కోవిడ్ 19 వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే క్వారంటైన్ కి తరలించాలన్నారు. నిత్యవసర సరుకుల కొనుగోలు విషయంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులూ రాకూడదని కూడా తెలియజేశారు.




క‌రోనా వైరస్ ని అంతమొందించేందుకు జగన్ సర్కార్ చురుకుగా చర్యలు తీసుకోవడం లేదనే వాదన గట్టిగా వినిపిస్తోంది. వాస్త‌వానికి ఆంధ్ర రాష్ట్రంలో క్షేత్ర‌స్థాయి లో డాక్టర్లు, హాస్పటల్స్, మౌలిక స‌దుపాయాలు కూడా ఉన్న‌ప్ప‌టికీ.. ఆ త‌ర‌హా బూమ్ ఎక్క‌డా క‌నిపించ‌కపోవ‌డం దారుణం అని రాజకీయ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. మ‌రి కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా మారుతున్న వేళ ముఖ్యమంత్రి జ‌గ‌న్ కేవ‌లం రెండు సమీక్షలు, మూడు సూచ‌న‌ల‌కే అధికారులతో మీటింగ్‌ను స‌రిపెడుతున్నార‌నే టాక్ వినిపిస్తోంది. రెండు రివ్యూలు, మూడు సూచనలకే పరిమితం కాకుండా సాక్షాత్తు జ‌గ‌నే రంగంలోకి దిగాల‌నే సూచ‌న‌లు పెద్ద ఎత్తున అందుతున్నాయి. సమీప భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారో చుడాలిక.


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: