ఏపీలో మార్చి నెల మొదటి వారం నుంచి కరోనా కేసులు నమోదవుతూ ఉన్నాయి. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ నేటికి 87 కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే 43 కరోనా కేసులు నమోదు కావడంతో రాష్ట్ర ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. రాష్ట్రంలో కొత్త కేసులు భారీగా నమోదవుతున్నా ప్రభుత్వం నుండి తగిన స్పందన లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 
 
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతునా కొందరు మంత్రులు మాత్రం మీడియా ముందుకు రావడం లేదు. ప్రతిపక్షాలు ఏవైనా విమర్శలు చేస్తే కొందరు మంత్రులు వెంటనే ఘాటు కౌంటర్లు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ మంత్రులు ఎందుకో పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఏపీ సీఎం జగన్, మంత్రి పేర్ని నాని, బుగ్గన రాజేంద్రనాథ్ మీడియా ముందుకు వచ్చి కరోనా విషయంలో ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర విషయాలను వెల్లడిస్తున్నారు. 
 
కానీ కొందరు మంత్రులు మాత్రం మౌనం పాటించడంలో ఒకరిని మించి మరొకరు పోటీ పడుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో మంత్రులు మౌనంగా ఉండటం సరి కాదు. కీలకమైన కేబినెట్ మంత్రులైన హోం మంత్రి సుచరిత పోలీసుల వ్యవహారాలపై, లాక్ డౌన్ అమలుపై దృష్టి పెట్టాల్సి ఉంది. 
 
మంత్రి ఆళ్ల నాని కరోనా రోగులకు అందిస్తున్న వైద్యం విషయంలో, కరోనా అనుమానితుల, ఇతర విషయాల్లో, బాధితులకు అవసరమైన ఏర్పాట్ల విషయంలో మరింత దృష్టి పెట్టాల్సి ఉంది. మంత్రి పేర్ని నాని పౌర సరఫరాల గురించి కాకుండా ప్రస్తుత సమయంలో ప్రజలకు ఉపయోగపడే విధంగా తగిన సూచనలు చేయాల్సి ఉంది. కానీ మంత్రులు మాత్రం మాట్లాడటంలో కాకుండా మౌనంలో ఒకరిని మించి ఒకరు పోటీ పడుతున్నారని ప్రజల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: