ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో ఏకంగా 43 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. తొలిసారిగా పశ్చిమ గోదావరి జిల్లాలో, కడప జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం... భారీ సంఖ్యలో ఒకే రోజు కేసులు నమోదు కావడంతో రెండు జిల్లాల్లో ప్రజలు భయపడున్నారు. 
 
ఇదే సమయంలో సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో, వాట్సాప్ గ్రూపులలో వైరల్ అవుతున్న వదంతులు వారిని మరింత టెన్షన్ కు గురి చేస్తున్నాయి. ఇప్పటికే కరోనా కారణంగా అనేక భయాల మధ్య రోజులు గడుపుతున్న ప్రజల్లో వైరల్ అవుతున్న వదంతులు గందరగోళం సృష్టిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం ఏపీలో తొలి మరణం అంటూ ఫేక్ న్యూస్ మీడియాలో వైరల్ అయింది. కలెక్టర్ స్పష్టత ఇచ్చేలోపే ఆ న్యూస్ ను చాలామంది నిజమని నమ్మేశారు. 
 
రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాలలో కరోనా కేసులు నమోదు కాకపోయినా కేసులు నమోదయ్యాయని వదంతులు వ్యాపిస్తున్నాయి. సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపులలో వైరల్ అవుతున్న వార్తలను కొందరు ప్రజలు నిజమేనని నమ్ముతూ వాటికి మరింత ప్రచారం కల్పిస్తున్నారు. ప్రభుత్వం వదంతుల విషయంలో చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజలకు కరోనా గురించి పూర్తి అవగాహన కల్పించాల్సి ఉంది. 
 
ప్రజలకు కరోనాపై పూర్తి స్థాయిలో అవగాహన లేకపోయినా వారు వైరస్ భారీన పడే అవకాశం ఉంది. ప్రభుత్వం ప్రతిరోజూ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వదంతులను ఖండిస్తూ ప్రజలకు రాష్ట్రంలో కరోనాకు సంబంధించిన సమాచారంతో పాటు సలహాలను, సూచనలకు ఇవ్వాల్సి ఉంది. ప్రజలు భయాందోళనకు గురి కాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రజలకు వాస్తవాలను తెలియజేసేందుకు ప్రభుత్వం మరింతగా దృష్టి పెట్టాలని పరిశీలకులు సూచిస్తున్నారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: