దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా వైరస్ పేరే వినిపిస్తుంది.  కరోనాతో జనాలు పిట్టాల్లా రాలిపోతున్నారు.  ఈ నేపథ్యంలో దేశం మొత్తం లాక్ డౌన్ చేస్తున్న విషయం తెలిసిందే.  అయితే తమ ప్రాణాలు ఫణంగా పెట్టి పోలీసులు, వైద్యరంగానికి చెందిన వారు మాత్రమే ధైర్యం చేసి కరోనా బాధితులను ఆదుకుంటుకుంటున్నారు.   దుబాయ్ కి చెందిన ఓ వ్యాపారితో ఆమె వివాహం ఆ రోజున జరగాల్సి ఉంది.   కానీ కరోనా రోగుల చికిత్సలో ఉన్న ఆమె తన మ్యారేజీ కన్నా.. ఈ రోగుల చికిత్సే తనకు ముఖ్యమని అంటోంది.  కేరళకు చెందిన 23 ఏళ్ళ డాక్టర్ షఫి మహమ్మద్ గొప్ప గుణమిది. 

 

ప్రస్తుతం కన్నూర్ లోని పెరియారం మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో… ఐసొలేషన్ వార్డుల్లోని కరోనా రోగులకు నిర్విరామంగా ఆమె చికిత్స చేస్తోంది.   అయితే పెళ్లి ప్రస్తావన తీసుకు వస్తే.. ఆమె నా పెళ్లి కన్నా ముఖ్యం ఇక్కడ కరోనాతో బాధపడే వారని అంటున్నారు. ఇది స్వాగతించదగిన నిర్ణయమని డాక్టర్ షఫి తండ్రి ముక్కం మహమ్మద్ అన్నారు.

 

తన కుమార్తె అభ్యర్థనను తాము వెంటనే అంగీకరించామని ఆయన చెప్పారు. ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు ఇండియాను అతలాకుతలం చేస్తున్నది.  ఇప్పటికే ఈ వైరస్ కారణంగా దేశంలో 1711 కేసులు నమోదయ్యాయి. ఈ ఒక్కరోజే 250 కొత్త కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.  

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: