కరోనా వైరస్ ఇపుడు వణికిస్తోంది. ఎవరి మటుకు వారు మాకు రాదు అని ధైర్యం చెప్పుకుంటున్నారు. మరో వైపు లాక్ డౌన్ అంటున్నా కూడా కరోనా కేసులు భీభత్సంగా పెరిగిపోతున్నాయి. ఇది ఎవరికీ అంతుపట్టడంలేదు. అదే టైమ్ లో మరణాలు కూడా ఎక్కువగా నమోదు అవుతున్నాయి. 

 

ఇవన్నీ ఇలా ఉంటే భారత్ లో కరోనా కేసుల నంబర్ విషయంలో వైద్య వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇప్పటివరకూ కరోనా కేసులు  1800 దగ్గర నంబర్ ఉండడాన్ని కొందరు అదుపులో ఉందని భావిస్తూంటే వైద్య నిపుణులు మాత్రం అది తప్పు అంటున్నారు. అసలు దేశంలో పెద్దగా టెస్టులు ఎక్కడ చేశారు అని కూడా అడుగుతున్నారు.

 

భారత్ జనాభా 130 కోట్లకు పైబడి ఉంది. మరి ఇంతవరకూ కరోనా వైరస్ టెస్టులు జరిగినవి చూస్తే ముప్పయి నలభై వేలకు మించి లేవు. అంటే మొత్తం దేశ జనాభాలో ఇది జీరో జీరో పాయింట్ శాతం కంటే కూడా చాలా తక్కువ అని చెప్పాలి. ఇదే విషయాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా చెబుతోంది. ప్రతీ వారికీ  టెస్టులు ఎక్కువగా చేయించండి అపుడే కరోనా వైరస్ లేదని నిర్ధారణకు రావచ్చు అంటోంది.

 

లాక్ డౌన్ చేయడం వల్ల మంచిదే కానీ కరోనా కేసులు తక్కువ అయిపోవు. అదే సమయంలో వ్యాధి ఉన్నవారెవరో కూడా తెలియదు అని కూడా అంటోంది. భారత్ లో కరోనాపై యుధ్ధం  ఓ విధంగా నెమ్మదిగానే సాగుతోందని చెప్పాలని వైద్య రంగం నిపుణులు అంటున్నారు. కరోనా వైరస్ ఉందని అనుమానం వచ్చిన వారికే టెస్టులు చేయిస్తున్నారు.

 

దీంతో దేశంలో కరోనా రెండవ దశలోనే ఉందన్న భావన కూడా ఉంది. అసలు కరోనా స్టేజ్ ఏంటి, అది ఎక్కడ ఎక్కువగా ఉంది. ఎవరి నుంచి ఎవరికి పాకింది అన్నది చూడాలంటే ఇంటింటి టెస్టులు చేయించాలి. అదే విధంగా కరోనాని పూర్తిగా నిరోధించేందుకు కూడా ఈ టెస్టులు ఉపయోగపడతాయి. మరి కనీసం లక్ష మందికైనా భారత్ ఇప్పటిదాకా టెస్టులు చేయించలేదు. మరి కరోనా నుంచి భద్రత ఎలా ఉందని భావించాలని  నిపుణులు అడుగుతున్న ప్రశ్నలో లాజిక్ చాలానే ఉంది.

 

అదే విధంగా అమెరికాలో జోరుగా టెస్టులు జరుగుతున్నాయి. ప్రతి నాలుగు లక్షల మందిలో లక్ష మంది కరోనా బాధితులు  అక్కడ ఉంటున్నారు. వారిలో నాలుగైదు వందల మంది వరకూ చనిపోతున్నారు. దాంతో అమెరికాలో కరోనా ఎక్కువగా ఉందని అంతా అనుకుంటున్నారు. ఆ విషయంలో  పెద్దగా టెస్టులే చేయని ఇండియాలో జోరుగా అవి జరిగితే ఇక్కడ కూడా  భీభత్సమైన నంబర్ నమోదు అవుతుందా లేదా అనది అపుడు చూసి కరోనా దశను చెప్పాలంటున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: