రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతూ ఉండటంతో ఏపీ సీఎం జగన్ ఈరోజు ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. కరోనా వైరస్ గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఒకరి నుంచి ఒకరికి వ్యాపించటమే కరోనా మైనస్ అని వైరస్ సోకడాన్ని తప్పుగానో, పాపంగానో చూడొద్దని చెప్పారు. వైరస్ లక్షణాలను గుర్తించి వైద్యం అందించడంలో సమగ్ర విధానాన్ని అవలంభిస్తున్నామని చెప్పారు. దేశాధినేతలకు కూడా వైరస్ సోకిందని తరువాత నయమైందని ప్రజలకు గుర్తు చేశారు. 
 
 
రాష్ట్రంలో ఇప్పటివరకూ 87 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని... వీరిలో 70 మంది ఢిల్లీ నుంచి రాష్ట్రానికి వచ్చినవారేనని చెప్పారు. రాష్ట్రం నుండి 1085 మంది ఢిల్లీ సదస్సుకు హాజరయ్యారని చెప్పారు. ఎవరైనా ఢిల్లీకి వెళ్లిన వారితో కాంటాక్ట్ లో ఉంటే అధికారులను సంప్రదించి లేదా 104కు కాల్ చేసి క్వారంటైన్ కు వెళ్లాలని సూచించారు. 104కు ఫోన్ చేస్తే వైద్యులు వెంటనే వచ్చి పరీక్షలు చేస్తారని సూచించారు. 
 
జలుబు, గొంతు నొప్పి, శ్వాస సంబంధిత సమస్యలు ఉంటే ఏ మాత్రం సంకోచించకుండా సమాచారం అందిస్తే వైద్యం అందిస్తామని తెలిపారు. గత 2 రోజులుగా పాజిటివ్ కేసులు పెరగడం బాధాకరం అని సీఎం అన్నారు. కరోనా వైరస్ ఒకరి నుంచి ఒకరిని వ్యాపించే వైరస్ మాత్రమేనని... ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు. ఎవరికి ఆరోగ్యం బాగా లేకపోయినా వాలంటీర్లు, ఆశా వర్కర్లు, హెల్త్ అసిస్టెంట్లను సంప్రదించాలని సూచించారు. 
 
ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని... అలా చేస్తే వ్యాధి కుటుంబ సభ్యులకు, ఇతరులకు వ్యాపించదని చెప్పారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, ప్రైవేట్ డాక్టర్లు వీరందరినీ కరోనాకు వైద్యం అందించడంలో భాగం కావాలని కోరారు. ఎవరైనా వైద్య పరీక్షలు అవసరం అయితే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు. చికిత్స చేయించుకుని వారు స్వీయ నిర్భంధంలో ఉండాలని సూచించారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: