కరోనా విజృంభిస్తున్న సమయంలో వైద్యులు, వైద్య సిబ్బంది చేస్తున్న సేవలను ఈ ప్రపంచం మరచిపోదు. కరోనా అంటేనే ప్రపంచమంతా వణికిపోతున్న సమయంలో వారికి అత్యంత సన్నిహితంగా ఉండి.. సేవలు చేయడం అంటే మాటలు కాదు. అది ప్రాణాలతో చెలగాటమే. చైనాలోనూ.. ఇటలీలోనూ కరోనా రోగులకు వైద్యం చేసిన వైద్యులు, నర్సులు కూడా ప్రాణాలు కోల్పోయిన వార్తలు మనం చూశాం.

 

 

అందుకే కరోనా కు వైద్యం చేస్తున్న వైద్యులు, నర్సుల విషయంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ ను అరికట్టడానికి , బాధితులకు చికిత్స చేస్తున్న వైద్యులకు ఒక్కొక్కరికి కోటి రూపాయల బీమా చేయించాలని నిర్ణయించారు. కరోనా వైరస్ సోకినవారికి చికిత్స చేస్తూ వైద్య సిబ్బంది ఎవరైనా మరణిస్తే వారి కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇస్తామని ఆయన తెలిపారు.

 

 

కరోనా పై ప్రపంచం చేస్తున్న పోరాటంలో వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది సేవలు సైన్యానికి ఏమాత్రం తక్కువ కాదని కేజ్రీవాల్ కామెంట్ చేశారు. వైద్యులు, నర్సులు, పారిశుధ్య సిబ్బంది ఎవరైనా మరణిస్తే వారి సేవలకు గుర్తింపుగా వారి కుటుంబాలకు కోటి రూపాయలు అందిస్తాం.. వారు ప్రభుత్వ లేదా ప్రైవేటు రంగం అనే దాంతో సంబంధం లేకుండా ఈ మొత్తం అందజేస్తాం అంటూ కేజ్రీవాల్ ప్రకటించారు.

 

 

కరోనాకు వైద్యం చేస్తున్న వైద్యుల కోసం మాటలు చెప్పడమే కాదు.. కేజ్రీవాల్ సర్కారు వైద్యులకు అన్ని సదుపాయాలు కల్పిస్తోంది. కరోనా వైద్యుల కోసం స్టార్ హోటళ్లలో బస ఏర్పాటు చేస్తామని కూడా అరవింద్ కేజ్రీవాల్ ప్రకటన చేశారు. కరోనా వైద్యుల విషయంలో కేజ్రీవాల్ నిర్ణయాలు దేశం ప్రశంసలు అందుకుంటున్నాయి. నిజంగా ఈ సమయంలో కరోనా వైద్యుల సేవలకు దేశం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేదు అంటే అతిశయోక్తి కాదు.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: