ఏపీలో కరోనా పరిస్థితిపై ఏపీ సీఎం జగన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. తాజా పరిస్థితిని తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు. సామాజిక దూరం పాటించాలని.. ఢిల్లీ వెళ్లిన వారు తప్పనిసరిగా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకోవాలని ఆయన పిలుపు ఇచ్చారు. కరోనా పై పోరాటానికి సహకరిస్తున్న అందరికీ ఏపీ సీఎం జగన్ కృతజ్ఞతలు తెలిపారు.

 

 

ఈ సమయంలో జగన్ ప్రత్యేకంగా కొందరికి థ్యాంక్స్ చెప్పారు. కరోనా వైరస్ పై పోరాటం, దాని వల్ల పూర్తిగా ఆదాయం రాని పరిస్థితుల్లో సహకరించిన ఉద్యోగులకు ఆయన ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పారు. ప్రజలకు తోడ్పాటు అందించాలన్న యత్నంలో రాష్ట్రంపై ఆర్దిక భారం పడిందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఈ పరిస్థితిలో తమ జీతాలను కొంత వాయిదా వేసుకోవడానికి అంగీకరించినందుకు, ఇది కష్టమైనా సహకరిస్తున్నందుకు ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల, ఐఎఎస్, ఐపిఎస్, గెజిటెడ్ అదికారులు అందరికీ హృదయ పూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నానని సీఎం జగన్ అన్నారు.

 

 

వ్యవసాయం చేసుకునే రైతులు, ఆక్వా రంగంలోని వారికి ఒకటి చెబుతున్నా.. మధ్యాహ్నం ఒంటిగంటకు అన్ని పనులు చేసుకోవాలని సూచించారు. వ్యవసాయం బతకాలి. ఆక్వా బతకాలి.. కూలీలు బతకాలి. పనులు చేసుకునేటప్పుడు ఒకే సలహా ఒకటే.. ఒకరికి ఒకరు దూరంగా ఉండాలని మాత్రం కోరుతున్నానన్నారు. అలా సామాజిక దూరం పాటిస్తూ ఏ పని చేసుకున్నా ఆక్షేపణ లేదని జగన్ అన్నారు.

 

 

ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్లు కూడా నడపవచ్చని సీఎం జగన్ అన్నారు. రైస్ మిల్స్, దాల్ మిల్స్ వంటివి పనిచేసుకోవచ్చని జగన్ సలహా ఇచ్చారు. కరోనా అన్నది జ్వరం వంటిది..దానిని నయం చేయవచ్చు.. భయపడొద్దు.. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కరోనాను అరికట్టొచ్చని జగన్ ప్రజలకు సూచించారు.

 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: