ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కరోనా వైరస్ కట్టడి చేయడానికి ఏపి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని అన్నారు.  వైరస్ లక్షణాలు ఉన్నవారిని గుర్తించడంతో పాటు వారికి చికిత్స అందించే వరకు సమగ్ర విధానాన్ని అవలంభిస్తున్నామని చెప్పారు.నిన్న రాత్రి 9 గంటల నుంచి ఈ రోజు ఉదయం 9 గంటల వరకూ 43 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఏకంగా 87కి చేరింది. 

 

ఢిల్లీ సదస్సులో పాల్గొని వచ్చిన వాళ్లతోనే వైరస్‌ విస్తరిస్తోందని చెప్పారు. అందువల్ల ఢిల్లీకి వెళ్లిన వారిని, వారితో కాంటాక్ట్ అయిన వారిని గుర్తించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. కరోనా కూడా మిగతా ఫ్లూ, జ్వరాల లాంటిదే అని సీఎం అన్నారు. కాకపోతే ఎక్కువ వయసున్న వారిలో.. బీపీ, షుగర్ లాంటి వ్యాధులు ఉన్నవారిపై తీవ్రత ఎక్కువ ఉంటుందని చెప్పారు. అందువల్ల ఎవరూ అధైర్య పడొద్దని, ఆందోళన చెందొద్దని విజ్ఞప్తి చేశారు. 

 

ఈ  కరోనా వైరస్ ఒకరి నుంచి మరకరికి సులువగా వ్యాప్తి చెందుతుందని అందరూ గుర్తు పెట్టుకోవాలని సూచించారు.   అయితే, వాళ్లలో చాలా మందికి జ్వరం వచ్చి నయం అయినట్టుగా తిరిగి బయట తిరుగుతున్న విషయం కనిపిస్తోందన్నారు.  అందువల్ల ఈ వైరస్ సోకడాన్ని పాపంగానో, తప్పుగానో చూడొద్దని రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు.

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: