క‌రోనా వైర‌స్.. చైనాలో పుట్టుకొచ్చిన ఈ మ‌హ‌మ్మారి ప్రపంచ‌దేశాల‌ను క‌మ్మేసింది. క‌రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్ లేక‌పోవ‌డంతో.. నివారణ పైనే అన్ని దేశాలు దృష్టి పెట్టాయి. అయిన‌ప్ప‌టికీ.. ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా ప్ర‌స్తుతం విల‌య తాండ‌వం చేస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు 8 లక్షలకు పైగా కేసులు న‌మోదు కాగా 40 వేల మందికి పైగా మృతి చెందారు. అయితే ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాపై కరోనా మహమ్మారి  మరణ మృదంగం మోగిస్తుంది. వందలాది ప్రాణాలు బలితీసుకుంటూ భీతావహ వాతావరణ సృష్టిస్తోంది. వాస్తవానికి ఈ వైరస్ చైనాలో ఉద్భవించినా.. అమెరికాను గజ గజ వణికిస్తోంది. 

 

మొదట్లో ఒక్క కేసు నమోదైతేనే ఏముందిలే అనుకున్నారంతా.. ఇప్పుడు ప్రపంచంలో లక్షలాది కేసులు నమోదయ్యే దేశంగా అమెరికా తయారవబోతోంది. అమెరికాలో జనవరి 20న మొట్టమొదటి కరోనా కేసు నమోదైంది. తర్వాత 70 రోజుల వ్యవధిలోనే ఆ దేశం.. ప్రపంచంలోకెల్లా మోస్ట్ ఎఫెక్టెడ్ గా మారిపోయింది. బుధవారం ఉదయం నాటికి అక్కడ కరోనా కేసుల సంఖ్య1.89లక్షలకు చేరింది. ఇప్పటిదాకా మొత్తం 4,055 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక తాజాగా అమెరికాలో ఇద్ద‌రు భార‌తీయుల‌ను క‌రోనా కబళించింది. కరోనా వైరస్‌తో బాధపడుతూ న్యూయార్క్‌లో ఒకరు, న్యూజెర్సీలో మరొకరు మృత్యువాత పడ్డారు. 

 

కేరళకు చెందిన 43 ఏళ్ల థామస్ డేవిడ్ న్యూయార్క్‌లో మృతి చెందగా.. అదే కేరళలోని ఎర్నాకులానికి చెందిన 85 ఏళ్ల కుంజమ్మ శామ్యూల్ న్యూజెర్సీలో మృత్యువాత పడ్డారు. కాగా, గ‌తంలో ఇరాన్, ఇటలీ, స్పెయిన్ దేశాలలో ఒక్కరు చొప్పున ముగ్గురు భారతీయులను క‌రోనా బలిగొన్న సంగ‌తి తెలిసిందే. దీంతో విదేశాలలో కరోనా తాకిడితో మృతి చెందిన వారి సంఖ్య అయిదుకు చేరింది. ఇదిలా ఉంటే.. మిగతా దేశాలతో పోల్చుకుంటే వ్యాధి రికవరీ రేటు చాలా తక్కువగా ఉండ‌డంతో ప్ర‌జ‌లు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. పైగా, క్రిటకల్, యాక్టివ్ కేసులు కూడా భారీగా ఉన్నాయి.

  

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: