ఏపీ మాజీ సీఎం చంద్రబాబు కరోనా కష్టకాలంలో హైదరాబాద్ కే పరిమితం అయ్యారు. అక్కడే కూర్చుని రోజూ ప్రెస్ మీట్లు పెడుతున్నారు. కరోనా సమయంలో ప్రజలను ఇలా ఆదుకోండి..అలా చేయండి అంటూ ఏపీ సీఎం జగన్‌ కు సలహాలు ఇస్తున్నారు. మొన్న మీడియాతో మాట్లాడుతూ ఈ కరోనా సమయంలో రైతులను జగన్ ఆదుకోవాలని సూచించారు. పంటలు మొత్తం ప్రభుత్వం కొనాలని సూచించారు. అయితే ఈ సలహాలు కొందరు వైసీపీ నేతలకు రుచించడం లేదు. అంతే వెంటనే కౌంటర్ ఎటాక్‌ కు రెడీ అవుతున్నారు.

 

 

ఇలాంటి కౌంటర్ ఎటాక్‌ కు రెడీగా ఉండే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి చంద్రబాబు వైఖరిపై విరుచుకుపడ్డారు. రైతుల ఆత్మహత్యలకు కారణమైన వ్యక్తి.. నేడు వారి గురించి మాట్లాడడం సిగ్గుచేటని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడును ఉద్దేశించి వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి కామెంట్ చేశారు. ధరల స్థిరీకరణ నిధి నీ హయాంలో లేదు. రైతుల ఆత్మహత్యలకు కారణమైన వ్యక్తివి ఇప్పుడు వాటి గురించి మాట్లాడటానికి సిగ్గనిపించడం లేదా బాబూ? ప్రతి గింజ కొనుగోలు చేస్తామని సిఎం జగన్ గారు హామీ ఇచ్చారు. పంట కోతలు యదావిధిగా జరగాలని ఆదేశించారు. రైతు నష్టపోకుండా చూసే పూచీ ప్రభుత్వానిది అంటూ విజయసాయిరెడ్డి స్పందించారు.

 

 

14 ఏళ్లు సిఎంగా ఉండి నువ్వు కట్టించిన కోల్డ్ స్టోరేజి కేంద్రాలెన్నీ చంద్రబాబూ? రైతుల గురించి మొసలి కన్నీరు కారుస్తున్నావు? రాష్ట్రంలో రైతులు, వ్యవసాయ కార్మికులు, కూలీలు ఎవరూ ఆకలితో బాధపడే పరిస్థితి లేదు. కరువు జాడ నీతోనే పోయింది. ఇంకెప్పుడూ రావద్దని ప్రజలు కోరుకుంటున్నారు అంటున్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.

 

 

హుదూద్, తిత్లీ తుఫాన్లను డీల్ చేశా అని కటింగులిస్తున్నాడు. తుఫాను పోయిన నాలుగు రోజుల తర్వాత కూడా మంచినీళ్లు అందించలేని పాలన నీది. వందల ట్యాంకర్లు సరఫరా చేసినట్టు బిల్లులు మింగారు అంటూ ఎంపీ విరుచుకుపడ్డారు. శ్రీకాకుళంలో బస్సు వద్దకు బాధితులు వచ్చి నిలదీస్తే, ఏయ్ మీదే వూరని గద్దించింది నువు కాదా? అంటూ విజయసాయిరెడ్డి నిలదీశారు.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: