పిల్లలు సహజంగా ఏదో ఒక తప్పుని చేస్తూ ఉంటారు . అయితే ఆ తప్పుని ఎలా కరెక్ట్ చెయ్యాలి ? వాళ్ళతో ఎలా ప్రవర్తించాలి? తప్పుని మల్లి వాళ్ళు తిరిగి చెయ్యకుండా వాళ్ళతో ఎలా వ్యవహరించాలి? ఇలా అనేక ప్రశ్నలు తల్లిదండ్రులకి ఉంటూనే ఉంటాయి. అయితే ఎంతో మంది తల్లిదండ్రులు పిల్లలతో  సరైన క్రమంలో నడుచుకోరు .

 

తప్పు చేస్తే ఏదో ఘోరం చేసినట్టు వాళ్ళు పెద్ద శిక్ష వేస్తారు. ఇది నిజంగా తప్పు. సరిగ్గా వాళ్ళతో వ్యవహరించి సరి చెయ్యడం మంచిది . మొదట ఏమైనా తప్పు చేస్తే కోపంగా చూడడం లేదా కొట్టడం బాగా అలవాటు. అయితే ముందు దీనిని కంట్రోల్ చేసుకోవాలి. అలానే ఏమైనా తప్పు చేస్తే నెమ్మదిగా వాళ్ళ దగ్గరకి వెళ్లి బుజ్జగీస్తూ నాన్న ఇది తప్పు మళ్ళీ ఇలా చెయ్యకూడదు అని నవ్వుతు ప్రశాంతంగా చెప్పడం తల్లిదండ్రులు అలవాటు చేసుకోవడం మంచి లక్షణం .

 

 

అలానే పిల్లలు చుట్టూ ఉన్నవి చూసి మంచో చెడో తెలియకుండానే నేర్చుకుంటారు. ఎంతో మంది తల్లిదండ్రులు వీటిని కరెక్ట్ చెయ్యకుండా ఉంటారు. పెద్దగా పట్టించుకోకుండా లైట్ తీసుకుంటారు. కాబట్టి తల్లిదండ్రులు పట్టించుకోవాలి. ఆలా చేయకుంటే అది కూడా తప్పే. వాళ్లకి మంచి నేర్పాలి.

 

ఆటలాడుకుంటూ నిత్యం ఉత్సాహంగా కేరింతలు కొడతారు పిల్లలు. ఇలా వాళ్ళని సొంతంగా ఉండేటట్టు చెయ్యాలి. ఆలా చేయడం వల్ల అని నేర్చుకుంటూ ఎంతో ఆనందంగా జీవితాన్ని సరైన క్రమంలో ఎదుర్కోగలడు  పిల్లవాడు.

 

తల్లిదండ్రుల సరైన సపోర్ట్ ఉంటే ఆ పిల్లవాడికి నిత్యం విజయాలే ఎప్పుడూ ఆనందాలే కదా. కాబట్టి కుటుంబం కూడా బాధ్యత వహించాలి. ఇంకేం ఉంది ఇవన్నీ పాటిస్తే ఆ బుడుగు జీవితం భలే భలేగా ఉంటుంది. భయం ఏలా? బాధ్యత మీరు చేపడితే ..

మరింత సమాచారం తెలుసుకోండి: