ఒక పక్క కరోనా వైరస్ విస్తరిస్తూ ప్రపంచం మొత్తం నాశనం అయ్యే దశలో ఉందీ అనే విషయం అందరికి అర్ధమవుతున్నా కొంత మంది మాత్రం ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీద తిరగడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. ఒక పక్క పోలీసులు ఎవరిని కూడా రోడ్ల మీదకు రావొద్దు అని జాగ్రత్తలు చెప్తున్నా సరే ఎవరూ కూడా వినే పరిస్థితిలో లేరు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. కరోనా వైరస్ ని ఇంకా చాలా మంది లైట్ తీసుకుని ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీద కు వస్తున్నారు. వారికి ఎన్ని విధాలుగా చెప్పినా సరే అర్ధం కావడం లేదు. రావొద్దు అని చెప్తే కొందరికి కోపం వచ్చే పరిస్థితి కూడా ఉంది. 

 

ఇప్పుడు తెలంగాణా పోలీసులు ఇక లాభం లేదని భావించి కొంత మంది వాహనాలను పూర్తి స్థాయిలో సీజ్ చేస్తున్నారు. డబ్బులు కట్టినా సరే వాటిని విడిచిపెట్టే అవకాశం లేదని అర్ధం ఇక. ఇక ఆ వాహనాలకు ఉన్న అనుమతులను కూడా రద్దు చేస్తున్నారు. హైదరాబాద్ లో దాదాపు 10 వేల వాహనాలను అధికారులు ఇదే విధంగా సీజ్ చేసినట్టు సమాచారం. ఎలాంటి పరిస్థితుల్లో కూడా రోడ్డు మీదకు రావొద్దని వస్తే మాత్రం క్షమించే పరిస్థితి లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినా సరే కొంత మంది మాత్రం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. 

 

ఎలాంటి పరిస్థితుల్లో ఎవరు చెప్పినా సరే వాటిని వదిలిపెట్టే అవకాశం లేదని తెలంగాణా పోలీసులు అంటున్నారు. సామాన్య ప్రజలకు కూడా పరిస్థితి అర్ధం కావడం లేదు. సామాన్యులు కూడా అర్ధం చేసుకోవాలని ప్రభుత్వాలు చెప్తున్నా సరే ఎవరూ కూడా వినే పరిస్థితి కనపడటం లేదు. బ్రతిమిలాడి చెప్పినా వినడం లేదు. ఒక్క హైదరాబాద్ లోనే కాదు... చాలా ప్రాంతాల్లో దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొంది ఇప్పుడు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: