కరోనా వైరస్ వస్తే ఎక్కువగా చనిపోయేది వృద్ధులు అనే విషయం చాలా మంది చెప్తూ ఉంటారు. కాని కాదు యువకులు కూడా అనే పరిస్థితి ఇప్పుడు నెలకొంది. అమెరికాలో కరోనా వైరస్ కారణంగా యువకులు ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారు. 20 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ వారిలో ఎక్కువగా మరణాలు ఉన్నాయనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. అక్కడి ప్రభుత్వం వరిని కట్టడి చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే వాళ్ళు మాత్రం ప్రభుత్వం మాట దాదాపుగా వినడం లేదు. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారు ఈ నెల రోజుల నుంచి కూడా. 

 

ఇప్పుడు వాళ్ళే ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారని అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ కూడా చెప్తుంది. కరోనా కట్టడి కోసం ఇప్పుడు అక్కడి ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతుంది. అయినా సరే అది మాత్రం అదుపులోకి వచ్చే అవకాశాలు దాదాపుగా కనపడటం లేదు. రెండు లక్షల మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. రెండు లక్షల మందిలో ఇప్పటి వరకు నాలుగు వేల మంది మరణించారు. రాబోయే రెండు వారాలలో కరోనా కేసులు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అలాగే మరణాలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి అనేది అక్కడి నిపుణులు చెప్పే మాట. 

 

ట్రంప్ సర్కార్ కి కూడా పరిస్థితి దాదాపుగా అర్ధమైంది. ఆయన కూడా కరోనా విషయంలో దేవుడు మీద భారం వేసే పరిస్థితికి వచ్చారు. అమెరికాలో వైరస్ ని కట్టడి చేయడం అనేది ఇప్పుడు ఒక సవాల్. అక్కడ ఆస్పత్రులు కూడా సరిపోవడం లేదనే ఆందోళన వ్యక్తమవుతుంది. అక్కడ వైద్య సదుపాయాలు ఎన్ని ఉన్నా సరే బాధితులు మాత్రం భారీగా పెరిగే అవకాశాలు ఉండటం తో పరిస్థితి ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు. కట్టడి చెయ్యాలని చూసినా సరే వైద్య సదుపాయాలు లేక ఇప్పుడు అమెరికా ఇబ్బ౦ది పడుతుంది అంటున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: