ఆంధ్రప్రదేశ్‌ లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. మొదట్లో ఒకటీ రెండు కేసులు బయటపడినా ఇప్పుడు రోజూ ఆ సంఖ్య పదుల్లోకి మారిపోయింది. ఈ నేపథ్యంలో ప్రజల్లో భయాందోళనలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితి ప్రజల మానసిక ఆరోగ్యంపైనా పడుతోంది.

 

 

ఇలాంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం మరో సదుపాయం ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. కరోనా నేపథ్యంలో ప్రజలకు అందుబాటులోకి హెల్ప్ లైన్ నెంబర్ ను అందించింది. 1077 హెల్ప్ లైన్ నెంబర్ అందుబాటులోకి తెచ్చిన అధికార యంత్రాంగం..అది 24 గంటలూ పనిచేస్తుందని తెలిపింది.

 

 

ఈ కాల్ సెంటర్‌ ద్వారా సాధారణ వైద్యులు, ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులు, మానసిక వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారు. నిరంతంరం వైద్య సలహాలు అందిస్తారు. ప్రజలు తమకు ఎలాంటి అనారోగ్య సమస్య తలెత్తినా ఈ నెంబర్‌కు 24 గంటల్లో ఎప్పుడైనా కాల్ చేయవచ్చు. వైద్యులు వారి సమస్యలను విని తగిన సూచనలు అందిస్తారు. అవసరమైన పక్షంలో 104 వంటి వాహనాలు పంపుతారు.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: