తాజాగా చంద్రబాబునాయుడు చేసిన ఓ ప్రకటనతో అందరిలోను ఇదే విషయమై అనుమానాలు పెరిగిపోతున్నాయి.  కరోనా వైరస్ వ్యాప్తి విషయమై  రాష్ట్రంలో ఆసుపత్రులు కావాల్సినన్ని లేవని, వైద్య పరికరాలు కూడా లేవని ప్రభుత్వాన్ని తప్పు పడుతున్నట్లుగా మాట్లాడారు. రోగులను చేర్చుకోవటానికి తగనన్ని బెడ్లు లేకపోవటం అందరు గమనించాలంటూ జనాలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నారు. చంద్రబాబు చెప్పినట్లుగా బెడ్లు, ఆసుపత్రులు, వైద్య పరికరాలు లేనిమాట నిజమే. కానీ దానికి బాధ్యుడెవరు ?

 

ఐదేళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించిన తానే అందుకు బాధ్యత వహించాలన్న విషయాన్ని చంద్రబాబు మరచిపోయారు. మాటము ముందు తాను 14 ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించానంటూ గొప్పగా చెప్పుకుంటుంటాడు. మరి తాను సిఎంగా ఉన్న కాలంలో వైద్య రంగం బలోపేతానికి ఏమి కృషి చేసినట్లు ?  అంటే తన చేతకానితనాన్ని తానే జనాల ముందు ఒప్పుకున్నాడా ? జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఏడాది కూడా కాలేదు. ఆసుపత్రులు, బెడ్లు, వైద్య పరికరాలను ఒక్కసారిగా ఎలా పెంచేస్తాడని చంద్రబాబు అనుకున్నాడు ?

 

ప్రతి విషయానికి జగన్ ను తప్పు పట్టడం, ఆరోపణలు చేయటమే చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్న విషయం అందరికీ అర్ధమైపోతోంది. కరోనా వైరస్ ప్రాబ్లెమ్ అన్నది హఠాత్తుగా మొదలైందన్న విషయం అందరికీ తెలిసిందే. సమస్య మొదలవ్వగానే పరిష్కారం సాధ్యం కాదుకదా. కాబట్టి  ఏ ప్రభుత్వమైనా చేయగలిగనంతే చేస్తుంది. మరి ఇంతచిన్న విషయం కూడా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబుకు తెలీదా ?  

 

రాజకీయాలు చేయకూడదని ఒకవైపు చెబుతునే మళ్ళీ జగన్ ప్రభుత్వం సరిగా చేయటం లేదని జనాలను రెచ్చగొట్టడంలో ఆంతర్యం ఏమిటి ? అంటే ఇక్కడ అర్ధమవుతున్నదేమంటే ఇటువంటి సంక్షోభ సమయంలో ప్రభుత్వం తనను ఏమాత్రం పట్టించుకోవటం లేదనే బాధ చంద్రబాబులో పెరిగిపోతోంది. దానికితోడు ఆన్ లైన్లో అఖిలపక్ష సమావేశం పెట్టాలన్న చంద్రబాబు డిమాండ్ ను జగన్ ఏమాత్రం పట్టించుకోలేదు. అందుకనే చంద్రబాబు రాజకీయాలు మొదలుపెట్టాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: