ఏపీలోనూ క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. మొదట్లో ఒకటీ రెండు కేసులు బయటపడినా ఇప్పుడు రోజూ ఆ సంఖ్య పదుల్లోకి మారిపోయింది. ఇటీవలి కాలం వరకూ ఒక్క కేసు కూడా నమోదు కాని జల్లాల్లో ఇప్పుడు ఏకంగా పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులు బయటపడటం షాకింగ్ గా మారుతోంది. ఇప్పుడు సీఎం జగన్ సొంత జిల్లాలో బుధవారం ఒక్కరోజే ఏకంగా 15 పాజిటివ్ కేసులు బయటపడటం కలకలం రేపుతోంది.

 

 

ఎందుకంటే కడప జిల్లాలో ఇప్పటి వరకూ ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. అసలు కరోనా విషయంలో ఇప్పటి వరకూ కడప జిల్లా పేరు వినిపించనేలేదు. అనుమానిత కేసులు కూడా పెద్దగా కనిపించలేదు. కానీ ఇప్పుడు ఏకంగా ఒకే రోజు 15 పాజిటివ్ కేసులు నమోదు కావడం సంచలనంగా మారింది. ఇవన్నీ కూడా ఢిల్లీ మర్కత్ ఘటనతో సంబంధం ఉన్నవే అని భావిస్తున్నారు.

 

 

బుధవారం కూడా ఇదే జరిగింది. అప్పటి వరకూ ఒక్క కేసు కూడా నమోదు కాని.. పశ్చిమ గోదావరి జిల్లాలో ఏకంగా 14 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొదట్లో కరోనా విషయంలో నెల్లూరు జిల్లాలో పాజిటివ్ కేసు బయటపడింది. ఆ తర్వాత ప్రకాశం జిల్లాలోనూ.. విశాఖ జిల్లాలోనూ ఎక్కువ కేసులు కనిపించాయి. కానీ అటు పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ..ఇటు కడప జిల్లాలో కానీ ఇటీవల వరకూ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

 

 

ఇప్పుడు అనూహ్యంగా సీఎం సొంత జిల్లాలో ఏకంగా ఒకే రోజు 15 పాజిటివ్ కేసులు బయటపడటం అందర్నీ ఆశ్చర్యంలో ముంచింది. అయితే తాజాగా బయటపడుతున్న కేసుల్లో ఎక్కువ భాగం ఢిల్లీలోని మత కార్యక్రమానికి వెళ్లి వచ్చిన వారివేనని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇంకా ఈ కార్యక్రమానికి వెళ్లిన వారిలో ఎంత మందికి పాజిటివ్ అని తేలుతుందో అన్న టెన్షన్‌ నెలకొంది.

 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: