కరోనా మహమ్మారికి చిన్నా పెద్దా తేడా లేదు.. కరోనా భూతానికి రాజు పేద తేడా లేదు.. కరోనా రక్కసికి పండితుడు పామరుడు అన్న విచక్షణ లేదు. సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే ఎవరినైనా కాటేస్తోంది. సరైన రక్షణ జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి దాని బారిన పడతారనుకోండి అది వేరే విషయం. ఎందుకంటే ప్రపంచంలో మహా మహా రాణులు, రాజులు, దేశాల అధ్యక్షులు కూడా కరోనా బారిన పడుతున్నారు.

 

 

ఇప్పటికే బ్రిటిష్ ప్రధానికి బోరిస్ జాన్సన్ కరోనా బారిన పడి చికిత్సలోకి వెళ్లారు. ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యూహు కూడా క్యారంటైన్ కు వెళ్లవలసి వచ్చింది. ఓ దేశపు యువరాణికి కూడా కరోనా సోకింది. అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం అదృష్టవశాత్తూ కరోనా కాటు నుంచి తప్పించుకున్నట్టు వస్తున్న కథనం ఆసక్తి రేపుతోంది.

 

 

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మాస్కోలోని ప్రత్యేక కరోనా ఆసుపత్రి చీఫ్‌గా పనిచేస్తున్న డెనిస్‌ ప్రాట్సెంకొను గత మంగళవారం కలుసుకున్నారు. పుతిన్‌ కొమునార్క ఆసుపత్రిని సందర్శించిన సమయంలో ఆయన పుతిన్‌తో పాటు ఉన్నారు. అయితే ఆ తర్వాత సదరు డెనిస్‌ కు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో రష్యా యంత్రాంగమంతా బిత్తరపోయింది. ఆయన నుంచి రష్యా అధ్యక్షుడికి ఏమైనా కరోనా వచ్చిందేమో అని భయపడిపోయారు.

 

 

యుద్ధ ప్రాతిపదికన పుతిన్ కు కరోనా పరీక్షలు చేయించారు. నెగిటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. రష్యా అధ్యక్షడు పుతిన్‌ కు కరోనా ఎందుకు రాలేదంటే.. పుతిన్ ఆరోజు ప్రత్యేకమైన డ్రెస్ ధరించారు. పుతిన్ హాస్పిటల్‌కు వెళ్లిన సమయంలో హజ్మత్‌ సూట్‌ను ధరించి ఉన్నారట. అందువల్లే ఆయన బతికిపోయారని రష్యన్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: