కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర ప్రభావం చూపుతున్న విషయం తెలిసిందే. ఢిల్లీ పర్యటనకు వెళ్లొచ్చిన వారిలో కరోనా పాజిటివ్ ఎక్కువ వచ్చింది. దీంతో ఒక్కసారిగా ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోయింది. అయితే ఇంకా ఢిల్లీ వెళ్లొచ్చిన వారికి కరోనా టెస్టులు చేయాల్సిన నేపథ్యంలో, మరో రెండు, మూడు రోజులు కరోనా కేసులు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే సీఎం జగన్ మరోసారి సమీక్ష సమావేశం పెట్టి, అధికారులని అప్రమత్తం చేసి, మీడియా సమావేశం పెట్టి ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిస్థితిని ప్రజలకు వివరించారు.

 

ఈ క్రమంలోనే కరోనా పట్ల ప్రజలని అప్రమత్తంగా ఉండమని చెబుతూనే, కరోనా పట్ల భయం పెట్టుకోవద్దని సూచించారు. అయితే దేశంలో ఏ నాయకుడు చెప్పని విధంగా జగన్ ఓ విలువైన సూచన చేశారు. మామూలుగా కరోనా అంటే జనం హడలిపోతున్న విషయం తెలిసిందే. అసలు తుమ్మినా, దగ్గినా ప్రజలు భయపడిపోతున్నారు. ఇక కరోనా బాధితులని అయితే అంటరానివారిగా చూస్తున్నారు.

 

అలాగే కరోనా బాధిత కుటుంబాన్ని కూడా ఏదో వెలివేసినట్లు చూస్తున్నారు. దీంతో కరోనా బాధితులు మరి మానసికంగా క్రుంగిపోతున్నారు. ఈ క్రమంలోనే జగన్..తనకున్న మానవత్వం చాటుకున్నారు. కరోనా వచ్చినవారి పట్ల ఆప్యాయతగా ఉండాలని, ప్రేమ పంచాలని చెప్పారు. తగిన జాగ్రత్తలు పాటిస్తూనే, కరోనా బాధితులని ఆప్యాయంగా చూసుకోవడం వల్ల వారు త్వరగా కోలుకుంటారని చెప్పారు.

 

ఇక కరోనా లక్షణాల ఉన్నవారు వెంటనే 104కి చేయాలని, వారికి డాక్టర్లు చికిత్స చేసి మెడిసిన్స్ ఇస్తారని, 14 రోజుల పాటు ఇంట్లోనే ఉండి జాగ్రత్తలు తీసుకుంటే కరోనా తగ్గిపోతుందని అన్నారు. కరోనా తీవ్రత ఎక్కువ ఉన్నవారికి ఐషోలేషన్ వార్డులో చికిత్స అందిస్తామని చెప్పారు. అయితే జగన్ చెప్పిన మాటలని, ప్రజలు ఇప్పటికైనా పట్టించుకుని, కరోనా బాధితుల పట్ల కాస్త కనికరం చూపిస్తే బాగుంటుంది. దగ్గర ఉండేవారు ఆప్యాయంగా ఉంటే కరోనా బాధితుడు త్వరగా కోలుకునే అవకాశముంటుంది.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: