ప్రస్తుతం దేశమంతా లాక్‌ డౌన్ నడుస్తోంది. ఇంటి నుంచి బయటకు రావడమే కష్టంగా ఉంది. ఏదో నిత్యావసరాల కోసం కాసేపు బయటకు వచ్చేందుకే పర్మిషన్ ఉంది. ఇలాంటి సమయంలో ఆర్థికంగా పుష్టిగా ఉన్నవారికి ఎలాంటి కష్టం లేదు. అనూహ్యంగా వచ్చిన ఈ లాక్ డౌన్ పిరియడ్ ను అనేక విధాలుగా ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ పేదలు, బీదల సంగతి.

 

 

రోజూ రెక్కాడితే కానీ డొక్కాడని బడుగు జీవుల సంగతి. వారికి నిత్యావసరాల కోసం కూడా ఎవరో ఒకరి వద్ద చేయి చాచాల్సిన పరిస్థితి.. ఇలాంటి సమయంలో ఏపీ సర్కారు

ఈ నెల 4న ప్రతి పేద కుటుంబానికి రూ.1000 చొప్పున అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఈ విషయం తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నిత్యావసర ధరలు పెరగకుండా చర్యలు తీసుకున్నామని ఉప ముఖ్య మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు.

 

 

ఈ నెల 4న ప్రతి పేద కుటుంబానికి రూ.1000 చొప్పున అందజేస్తామని... నగరాలు, పట్టణాల్లో నిత్యావసర వస్తువులు అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. కరోనా కేసులు ప్రస్తుతం పెరుగుతున్నాయి. ఇది జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ముఖ్యంగా నగరాల్లో పాజిటివ్ కేసులు పెరుగుదల ఎక్కువగా ఉంది. అవసరమైన మేరకు వ్యవసాయ సంబంధిత సరకుల రవాణాకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు.

 

 

ఆహారం లేకుండా ఎవరూ ఇబ్బందిపడకూడదని సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశించారని మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ తెలిపారు. జనమంతా కచ్చితంగా సోషల్ డిస్టెన్స్ పాటించాలి. క్రిమి చిన్నదైనా పెద్ద సైన్యంతో మనం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అవసరమైన వారికి రాజమండ్రి లాంటి నగరాల్లో స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాయని వివరించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: