ప్రస్తుతం ఎక్కడ చూసిన ప్రజలు అందరి మాట వినేది కరోనా వైరస్. ఇలాంటి సమయంలో కూడా ఓ బామ్మ చేసిన త్యాగం అందరి హృదయాలను  కలిచివేస్తుంది. ఇటీవల బ్రెజిల్‌కి చెందిన సుజానె హయ్‌లార్ట్స్ (90) శ్వాస సంబంధింత బాధతో ఆస్పత్రిలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇక వైదులు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత అసలు విషయం బయట పడింది. రిపోర్ట్స్ ఆధారంగా ఆ బామ్మకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవడంతో ఐసోలేషన్‌ లో ఉంచి బామ్మకి చికిత్స అందచేశారు వైదులు.

 


ఇది ఇలా ఉండగా ఆ బామ్మ నిర్ణయానికి అందరు ఆశ్చర్యపోయారు. నిజానికి కొన్ని ప్రాంతాలలో ఆస్పత్రిలో సరైన వైద్య సదుపాయాలు లేకుండా..  వైద్య పరికరాలు కూడా సరిగా లేకపోవడంతో చాలా మంది చనిపోతున్నారు అన్న విషయం ఆ బామ్మ మనసు కలిచివేసింది. ఆ పరిస్థితిలో కూడా ఆమె తన ప్రాణాలు పోయినా ఫర్వాలేదని నిర్ణయం తీసుకుంది. ఆ బామ్మాని వెంటిలేటర్ లో పెట్టేందుకు సిద్ధమైన డాక్టర్లకు కంటతడి పెట్టించింది బామ్మా మాటలు. నేను చాలా మంచి జీవితం కోనసాగించాను. నాకు వెంటిలేటర్ అవసరం లేదు అని డాక్టర్లకు ఆమె కోరింది. అది కరోనా బారిన పడిన యువతకు చాలా ఉపయోగపడుతుందని... చిన్న వయస్సు వారిని బతికించండి’ అంటూ ఆమె డాక్టర్లను కోరడం జరిగింది. చివరికి తన ప్రాణాలు వదిలేసి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది ఆ బామ్మా....

 

 
ఆ తర్వాత రెండు రోజులకు సుజానె మరణించడం ప్రతి ఒక్కరి హృదయాలను కలిచి చేసింది. మరో ఒకరి  ప్రాణం కాపాడడం కోసం తన ప్రాణాలు సైతం పక్కన పెట్టి ఆమె చేసిన త్యాగం కంటతడి పెట్టించింది అందరిని. ఇప్పటికే యూకే‌లో కరోనా వైరస్ బాధితుల సంఖ్య రోజు రోజుకి బాగా పెరిగిపోతుంది. ఇప్పటికే బెల్జియంలో 700కు పైగా మరణాలు నమోదు అవ్వడం జరిగింది.  సుమారు 12,775 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవ్వగా, వెయ్యి మందికి పైగా ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌ లో ఉంది వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అమెరికాలో యుక్త వయసులో ఉన్న వారు కూడా కరోనా వైరస్ కారణంగా మరణించిన సంఘటనలు కూడా ఉన్నాయి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle



Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: