ప్రస్తుతం ప్రపంచంలో వైద్యశాస్త్రానికే సవాల్‌గా మారి.. శాస్త్రవేత్తలను ముప్పతిప్పలు పెడుతున్న వైరస్ కరోనా.. ఈ వైరస్‌ను లోతుగా పరిశీలించిన కొద్ది ఎన్నెన్నో నమ్మలేని నిజాలు బయటకు వస్తున్నాయి.. ఇప్పటి వరకు ఈ ఉగ్రవాదిని జయించాలని పోరాటం చేయని దేశం లేదు.. అయినా గానీ ప్రపంచ దేశాలను ముప్పతిప్పలు పెడుతు మూడు చెరువుల నీళ్లు తాగిస్తుంది.. ఎవరికి లొంగకుండా తన ప్రయాణాన్ని అడ్దులేకుండా కొనసాగిస్తుంది.. దాదాపుగా కరోనా వైరస్ గురించి పూర్తిగా అర్ధం చేసుకున్న వారి అనుభవాలను వింటే గానీ ఇది ఎంత భయంకరమైన క్రిమినో అర్ధం కాదు..

 

 

ఇప్పటికి కొందరు కరోనాను చాలా తేలికగా తీసుకుంటున్నారు.. ఇకపోతే తాజాగా చైనా డాక్టర్లు ఒక షాకింగ్ న్యూస్‌ను బయట పెట్టారు.. అదేమంటే కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి నుంచి కళ్లె, మలం సేకరించి పరీక్షలు చేయగా విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయట. రక్తనమూనాలో వైరస్ పాజిటివ్ వచ్చినప్పటికీ వ్యక్తి కళ్లె, మలంలో మాత్రం వైరస్ ఆనవాళ్లు కనిపించాయని చైనా డాక్టర్లు వెల్లడించారు. ఈ విషయాన్ని అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ జర్నల్​లో ప్రచురితమైంది. దీంతో ఈ మహమ్మారి ఆటకట్టించేందుకు వ్యాక్సిన్ కనిపెట్టడానికి ప్రయత్నిస్తోన్న ప్రపంచ వైద్య నిపుణులకు, శాస్త్రవేత్తలకు ఇదో పెద్ద సవాల్ గా మారింది.

 

 

ఇదిలా ఉండగా కరోనా బారిన పడిన వ్యక్తిని డిశ్చార్జ్ చేసేముందు అతని కఫాన్ని సేకరించి మరొకసారి పరీక్షలు నిర్వహిస్తారు.. కాగా అందులో వచ్చే ఫలితాలను బట్టి బాధితుడికి కరోనా తగ్గిందా లేదా అనే విషయాలు తెలుస్తాయి.. ఈ ఒక్క పరీక్షనే కాకుండా శరీరంలోని ఇతర భాగాల నుంచి కూడా శాంపిల్స్ సేకరించాలా అన్న విషయంపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది.

 

 

అయితే వైరస్ టెస్టుల్లో కరోనా నెగిటివ్ గా తేలాక కూడా కొందరు బాధితుల కళ్లెల్లో 39 రోజులు, మలంలో 13 రోజుల పాటు వైరస్ ఆనవాళ్లున్నట్లు గుర్తించారట డాక్టర్లు.. అయితే ఇలా కూడా వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకుతుందా అన్న దానిపై అధ్యయనం చేస్తే మరిన్ని విషయాలు కనిపెట్టవచ్చని పేర్కొంటున్నారు వైద్యులు..  

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: