క‌ర్నాక‌ట మాజీ సీఎం కుమార‌స్వామి గౌడ భార్య రాధిక గ‌తంలో క‌న్న‌డ నాడ టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. ఆమె అక్క‌డ టాప్ హీరోయిన్‌గా ఉన్న టైంలోనే అప్ప‌టికే అటు రాజ‌కీయాల్లోనూ.. ఇటు సినిమాల్లో నిర్మాత‌, డిస్ట్రిబ్యూట‌ర్‌గా ఉన్న కుమార‌స్వామితో ప్రేమ‌లో ప‌డ‌డం ఆయ‌న్ను సీక్రెట్‌గా పెళ్లాడ‌డం జ‌రిగిపోయాయి. ఈ దంప‌తుల‌కు ఓ పాప కూడా జ‌న్మించింది. అప్ప‌టికే కుమార‌స్వామికి అనిత‌తో పెళ్ల‌య్యి వారికి పిల్లలు ఉన్నా కూడా కుమార‌స్వామి రాధిక‌ను పెళ్లాడాడు. 

 

రాధిక తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా సుప‌రిచితురాలే. నంద‌మూరి హీరో తార‌క‌ర‌త్న హీరోగా వ‌చ్చిన భ‌ద్రాద్రి రాముడు సినిమాలో ఆమె హీరోయిన్‌గా న‌టించింది. ఆ సినిమా ప్లాప్ అవ్వ‌డంతో ఆ త‌ర్వాత ఆమెకు తెలుగులో అవ‌కాశాలు రాలేదు. అయితే కోడి రామ‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ భ‌క్తి చిత్రంతో ఆమె చాలా లాంగ్ గ్యాప్ త‌ర్వాత తెలుగులో మ‌ళ్లీ క‌నిపించింది. కుమారస్వామితో పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన రాధిక మళ్లీ ఇప్పుడు కెమెరా ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. కుమార స్వామి సీఎంగా ఉన్న సమయంలోనే ఈమె రెండు మూడు సినిమాలకు కమిట్ అయ్యింది.

 

ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు రీ ఎంట్రీలో ఆమె మ‌రింత గ్లామ‌ర‌సం ఒలికించాల‌నుకుంటోంద‌ట‌. అలాగే యంగ్ హీరోల‌కు జోడీగా న‌టించాల‌న్న ఆస‌క్తితో ఉంద‌ని.. అందుకు ప‌చ్చ జెండా ఊపింద‌ని అంటున్నారు. అటు హీరోయిన్‌గానే కాకుండా ఇటు క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా కూడా కీల‌క పాత్ర‌ల్లో న‌టించేందుకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింద‌ని అంటున్నారు. రాధిక 2002లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి చాలా రొమాంటిక్ సినిమాలు కూడా చేసింది. అయితే ఇప్పుడు ఓ మాజీ సీఎం భార్య‌గా.. బిడ్డ త‌ల్లిగా ఉన్న రాధిక రొమాంటిక్ సినిమాలు చేస్తానంటూ ప్రేక్ష‌కులు చూస్తారా ? ఈ ముద‌రు హీరోయిన్ ఇప్పుడు మెప్పిస్తుందా ? అన్న‌ది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: