కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తున్న సమయంలో ఏపీలో రాజకీయాలు కూడా రాజుకుంటున్నాయి. అందరూ కలిసికట్టుగా ఉండి కరోనాని ఎదురుకోవాల్సింది పోయి, మనోళ్ళు రాజకీయం చేయడంలో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఎవరూ తగ్గడం లేదు. అయితే వీరి మధ్య మాటల యుద్ధం పెరగడానికి అసలు కారణం.... రేషన్ సప్లై. మొదట ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా రేషన్ పంపిణీ చేస్తామని చెప్పింది. కానీ వాలంటీర్లు కరోనా సర్వేలో ఉండటంతో, ప్రజలే డీలర్ షాపులు దగ్గరకొచ్చి రేషన్ తీసుకుంటున్నారు. దీంతో ప్రజలు ఇలా ఒకేచోట చేరితే కరోనా ఎక్కువ వచ్చే అవకాశముందని, వాలంటీర్ల ఏమయ్యారని, మంత్రి కొడాలి నాని ఫెయిల్ అయ్యారంటూ టీడీపీ విమర్శలు గుప్పించడం మొదలుపెట్టింది.

 

ఇక దీనికి కౌంటర్‌గా మంత్రి కొడాలి నాని, టీడీపీ నేతలు, చంద్రబాబుపై దారుణ వ్యాఖ్యలు చేశారు. 70 ఏళ్ళు ఉన్న చంద్రబాబు కరోనా వల్ల చచ్చిపోతానని భయమేసి, హైదరాబాద్‌లో దాక్కున్నారని మాట్లాడారు. ఇక నానికి తోడుగా మరికొందరు మంత్రులు కూడా లైన్‌లోకి వచ్చి బాబు హైదరాబాద్‌లో ఉండి నీతి వాక్యాలు చెప్పడం ఆపాలని, పక్క రాష్ట్రాల్లో ఉంటూ లేఖలు రాయడం ఫ్యాషన్‌గా మారిందని చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.

 

అయితే ఇక్కడొక విషయం చెప్పాలి. చంద్రబాబు ప్రతిపక్షానికి పరిమితమైన దగ్గర నుంచి ప్రతి శనివారం హైదరాబాద్ వెళుతున్నారు. ఇక అలాగే జనతా కర్ఫ్యూ ముందురోజు హైదరాబాద్‌ వెళ్లారు. ఆ తర్వాత ఆదివారం రోజు కర్ఫ్యూ నడిచింది. ఆ వెంటనే లాక్ డౌన్, దీంతో బాబు ఇంటి వద్ద ఉంటూనే కరోనా పట్ల ప్రజలకు జాగ్రత్తలు చెబుతున్నారు. పెద్దగా రాజకీయం కూడా మాట్లాడకుండా టీడీపీ నేతలనీ ఫీల్డ్‌లోకి దిగి ప్రజలకు సాయం చేయాలని పిలుపునిచ్చారు.

 

పైగా ఇలాంటి సమయాల్లో ఆయన ఏపీకి వస్తే కరోనా ఏమి ఆగదు. అలా అని ఆయన ఏపీకి వచ్చి ప్రజల మధ్యలో తిరగడానికి కుదరదు. అక్కడ కూడా మీడియా సమావేశం పెట్టడమో, టీడీపీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించడమో చేస్తారు. ఇక అలాంటప్పుడు ఆయన హైదరాబాద్‌లో ఉండటం వల్ల వచ్చే నష్టం ఏంటో అర్ధం కావడం లేదు.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: