తెలంగాణలో క్వారంటైన్ లో ఉన్న వారందరినీ జీపీఎస్ పద్ధతిలో ట్రాకింగ్ చేస్తున్నట్లు వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.  రాష్ట్రంలో దాదాపు పాతిక వేల మంది హోం క్వారంటైన్ లో ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో సుమారు 25 వేల మంది హోం క్వారంటైన్ లో ఉన్నారని చెప్పారు. రియల్ టైమ్ లో వారు ఎక్కడ ఉన్నది గుర్తిస్తున్నామని, కోవిడ్ మానిటరింగ్ వ్యవస్థ ద్వారా ఈ ప్రక్రియ జరుగుతున్నట్టు వివరించారు.  

 

కరోనా బారినపడి వైద్య చికిత్స అనంతరం దాని నుంచి కోలుకున్న ఇద్దరిని  గాంధీ ఆసుపత్రి నుంచి ఇవాళ డిశ్చార్జి చేశామని చెప్పారు.  ఇదిలా ఉంటే తెలంగాణలో కరోనా వైరస్‌ బారిన పడిన మరో వ్యక్తి మృతిచెందారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగి మృతిచెందినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రవణ్‌ తెలిపారు.  

 

అయితే కరోనా వ్యాధితో మృతి చెందిన మృతదేహాన్ని బయటకు తీసుకెళ్లాలని కోరిన సెక్యూరిటీ గార్డులు, వార్డుబాయ్‌లపై రోగి బంధువులు దాడికి పాల్పడ్డారు. దీంతో అక్కడ కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్నట్లు తెలిసింది. అయితే మృతి చెందిన వ్యక్తి నిర్మల్ కి చెందిన వారిగా చెబుతున్నారు.  అయితే ఈ కరోనా వైరస్ ప్రభావం మరి కొన్ని రోజుల్లో తీవ్ర రూపం దాల్చబోతుందని.. ఈ కొన్ని రోజులు అందరూ ఇంటిపట్టున ఉండాలని అంటున్నారు.  

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: