ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న పేరు... కరోనా వైరస్.  ఈ దేశం ఆ దేశం అనే తేడా లేకుండా అన్ని దేశాలకు ఇప్పుడు ఇదే సమస్యగా పరిణమించింది. చైనాలో మొదలైన ఈ వైరస్...దాదాపు ప్రపంచ దేశాలన్నిటిని చుట్టేసింది. ఇక దాదాపు 9 లక్షల వరకు ఈ మహమ్మారి బారిన పడితే, 44 వేలకు పైనే ప్రజలు మరణించారు. ఇటు ఈ కరోనా ఇండియాని కూడా వణికిస్తుంది. 1600కు పైనే కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 50 మంది వరకు మరణించారు.

 

అయితే ఈ కరోనాపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురించి కూడా ఓ ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. అసలు చైనాలో కరోనా  విజృంభింస్తున్న తరుణంలో ఇండియా ప్రభుత్వం, కరోనా వ్యాప్తి రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న సంగతి తెలిసిందే. అలాగే ముందు జాగ్రత్తగా అంతర్జాతీయ విమానాలను కూడా ఆపలేదు. అయితే ఇండియాలో ప్రభావం నిదానంగా మొదలైనప్పుడే రాహుల్ గాంధీ, కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

 

కరోనా పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని, కరోనా మనషులుపైన, ఆర్ధిక వ్యవస్థ పైన తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది అంటూ హెచ్చరించారు. కానీ రాహుల్ హెచ్చరికలని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోలేదు. కరోనా ప్రభావం మనదేశంలో పెద్దగా లేదంటూ ప్రకటనలు చేశారు. ఇక ఆ తర్వాత నుంచి పరిస్థితులు చేజారిపోతూ వచ్చాయి. అంతర్జాతీయ విమాన సేవలని ఆపకపోవడం వల్ల కరోనా బాధితులు పెరుగుతూ వచ్చారు. ఇక చివరికి విమాన సర్వీసులని ఆపి, లాక్ డౌన్ ప్రకటించిన కరోనా కేసులు పెరుగుతున్నాయి.

 

అయితే రాహుల్ చెప్పినప్పుడే కేంద్రం అలెర్ట్ అయితే బాగుండేదని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ ప్రముఖ నేషనల్ న్యూస్ ఛానల్ యాంకర్ రాజ్దీప్ సర్దేశాయ్ ఇదే విషయంపై స్పందించారు.  ముందులో తాను కూడా రాహుల్ మాటలని పట్టించుకోలేదని, కానీ కరోనా గురించి మొదట హెచ్చరించిన జాతీయ నాయకుడు రాహుల్ గాంధీనే అని, అప్పుడు అంతర్జాతీయ విమాన సర్వీసులని ఆపేసి ఉంటే ఇప్పుడు పరిస్తితి ఇలా ఉండేది కాదని అన్నారు.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: