మునుపెన్నడూ ఎరుగని రీతిలో యావత్ ప్రపంచాన్ని వణికిస్తూ కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాలపై పంజా విసురుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ కరోనా పై అందరిలోనూ ఎన్నో ప్రశ్నలు, మరెన్నో అనుమానాలు రోజురోజుకీ పెరుగుతునే ఉన్నాయి. అసలు ఈ కరోనా విధ్వంసం ఎప్పటికి ఆగుతుంది? దీనికి మెడిసిన్ ఉండదా? ఇక ఈ కరోనా వచ్చి తగ్గిపోయిన వాళ్ళకు కూడా వస్తుందా? ఇలా చెప్పుకుంటూ పోతే ఈ కరోనా మహమ్మారిపై బోలెడు అనుమానాలు ఉన్నాయి.

 

అయితే ఇందులో ఒక్కసారి కరోనా వచ్చి కోలుకున్న వ్యక్తికి మళ్ళీ కరోనా వచ్చే అవకాశం ఉందా? అనే విషయం గురించి ఒక్కసారి మాట్లాడుకుంటే, కరోనా వచ్చి తగ్గిన వ్యక్తికి మళ్ళీ వైరస్ ఎటాక్ అయిందని జపాన్‌లో బయటపడింది. కరోనా నెగిటివ్ అని వచ్చిన తర్వాత ఆ వైరస్ కణాలు లోపల ఉండి జపాన్ లో 70ఏళ్ల వయసున్న ఓ వ్యక్తికి  మళ్ళీ కరోనా వచ్చింది.

 

మామూలుగా ఒక వ్యక్తికి కరోనా వచ్చి తగ్గిపోయిందంటే అతనిలో వ్యాధి నిరోధక శక్తి పెరిగితేనే అది సాధ్యం అవుతుంది. సాధారణంగా వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉన్న వాళ్ళకి కరోనా సోకినా త్వరగా ఎలా అయితే బయటపడదో అలాగే ఒకసారి కరోనా వచ్చిన వ్యక్తికి కూడా వ్యాధి నిరోధక శక్తి పెరగడం వల్ల కరోనా వైరస్ పూర్తిగా చనిపోయినట్టు కాదని జపాన్ వ్యక్తి అనుభవంతో తెలిసింది. చికిత్స చేసినా లోపల కొన్ని కణాలు ఉండిపోవచ్చని,  రోగ నిరోధక శక్తి పెరగడం వల్ల దాని గురించి బయటపడకపోవచ్చని, ఈ కణాలు ఒకదానికొకటి పెరిగిపోయి మనిషిలోని సత్తువ క్షీణించినప్పుడు ఇది మళ్లీ బయటపడుతుందని అర్ధమైంది.

 

అయితే ఈ విషయాన్ని కొందరు వైద్య నిపుణులు కొట్టిపారేస్తున్నారు. కరోనా వచ్చి, తగ్గిపోయిన వ్యక్తికి మళ్ళీ కరోనా వచ్చే అవకాశం లేదని, కాకపోతే అతను జాగ్రత్తలు పాటించకుండా వేరే కరోనా ఉన్న వ్యక్తులతో ట్రావెల్ అయితే మాత్రం రావడం పక్కా అని చెబుతున్నారు. మొత్తానికైతే ఈ కరోనా దెబ్బకు ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో అర్ధం కాకుండా ఉంది.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: