తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడి చేయడానికి సీఎం కేసీఆర్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రజలకు కలుగుతున్న భయాందోళనలను తీసివేయడానికి మీడియా సమావేశాలు పెడుతూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ఎక్కడా కూడా వైద్య సేవలు ఎవరికీ తక్కువ కాకుండా ప్రతి ఒక్కరిని సమన్వయ పరుస్తూ కరోనా వైరస్ అరికట్టడానికి తగు జాగ్రత్తలు సూచనలు అధికారులకు అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు కరోనా వైరస్ సమస్య గురించి జిల్లా అధికారులతో ఫోన్లో మాట్లాడుతూ ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా కెసిఆర్ వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉండగా 21 రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం ప్రజలందరినీ ఇంటికే పరిమితం కావాలని లాక్ డౌన్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసినదే.

 

ఈ నేపథ్యంలో చాలా మంది రాష్ట్రంలో ఉన్న ఆకతాయిలు వీటిని ఏమీ పట్టించుకోకుండా ఇష్టానుసారంగా తిరగడంతో పోలీసులు బడిత పూజ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల పోలీసులు ప్రవర్తిస్తున్న తీరు సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలు తీవ్ర వివాదాస్పదం అవుతున్నాయి. తాజాగా తెలంగాణలోని జనగాం జిల్లా చిల్పూర్ మండలంలో పోలీసుల చర్య వివాదాస్పదమైంది. కరోనాతో లాక్ డౌన్ వేళ ఇంటి బయట పేకాట ఆడుకుంటున్న ముగ్గురిని చావుబాదిన తీరు విమర్శల పాలైంది. 

 

ముగ్గురుని మోకాళ్లపై కూర్చోబెట్టి వీపులు వెనుకాల దారుణంగా కొట్టిన వైనంపై స్థానికులు మండిపడుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు పోలీసుల తీరుపై తీవ్రంగా విమర్శలు చేశారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కొట్టిన పోలీసులపై యాక్షన్ తీసుకోవాలి డిమాండ్ చేస్తున్నారు. ప్రజలను అరికట్టాలి గానే చావగొట్టాలి అన్నట్టుగా తెలంగాణ పోలీసులు వ్యవహరిస్తున్నారని... ప్రజలను కొట్టకుండా వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తే బాగుంటుందని, పనిష్మెంట్ ఇచ్చిన వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తే అలాంటివి రిపీట్ అవ్వకుండా ఉంటాయని సోషల్ మీడియాలో నెటిజన్లు కోరుతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: