దేశ వ్యాప్తంగా కరోనా విస్తృతికి కారణమైన మర్కజ్ వివాదం సద్దుమణిగినట్లేనా?, దేశ వ్యాప్తంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన  ముస్లిం మతస్థులంతా వైద్య పరీక్షలకు అంగీకరించినట్లేనా ?? అంటే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్  అవుననే అంటున్నారు .  కరోనా విస్తృతికి కారణమైన మర్కజ్ మసీదు ప్రార్థనల్లో పాల్గొన్న వందలాది మంది ముస్లిం మతస్థులు, విదేశాలకు చెందిన మతగురువులు వైద్య పరీక్షలకు ససేమిరా అనడం, క్వారంటైన్ కు నిరాకరించడంతో   కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా , అజిత్ దోవల్ ను రంగం లోకి దించారు .

 

 ఒక దశలో ముస్లిం  మతపెద్దలు , తబ్లిగ్ జమాత్ నేత మౌలానా సాద్ సైతం వైద్య పరీక్షలు , క్వారంటైన్ కు నిరాకరించారు . దీనితో  ఈ సున్నితమైన  సమస్య  పరిష్కరించేందుకు రంగం లోకి దిగిన  దోవల్ , ముస్లిం ఉలేమాలతో చర్చలు జరిపారు . మర్కజ్ మసీదు లో ఉన్న ఇతర దేశాలకు చెందిన  మతపెద్దలు , దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి  వైద్య పరీక్షలు నిర్వహించి , క్వారంటైన్ కు  తరలించే విధంగా ఉలేమాలను ఒప్పించడం లో ఆయన  సక్సెసయ్యారు . మసీదు లో ఉన్న వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి,  మసీదును శుభ్రం చేశారు . మర్కజ్ మసీదు నుంచి అందర్నీ ఖాళీ చేయించడం లో దోవల్ మరొకసారి తన చతురతను ప్రదర్శించి అందరి చేత  శహభాష్ అన్పించుకున్నారు .

 

మర్కజ్ మసీదులో 216 మంది విదేశీయులుండగా  వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు .  విదేశాల నుంచి వచ్చిన మతగురువులు దేశం లోని ఇతర మసీదుల్లో సుమారు 800 మంది వరకుఉన్నట్లు ప్రాథమిక సమాచారం ప్రకారం తెలుస్తోంది . వీరికి కూడా వైద్య పరీక్షలు నిర్వహించి ,  కరోనా బారిన పడినవార్ని ఐసోలేషన్ కు తరలించాలని నిర్ణయించారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: