దేశంలో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు భారీగా పెరుగుతోంది. భారత్ లో బాధితుల సంఖ్య 1637కు చేరగా మృతుల సంఖ్య 38కు చేరింది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతూ ఉండటంతో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావడం లేదు. కరోనా విజృంభణతో అమెరికా, ఇటలీ,స్పెయిన్ దేశాలలో వేల సంఖ్యలో కరోనా భారీన పడి ప్రజలు మృత్యువాత పడుతున్నారు. ఇతర దేశాలతో పోలిస్తే మరణాల సంఖ్య తక్కువగానే ఉన్నా ప్రతిరోజూ వందల సంఖ్యలో కేసులు నమోదవుతూ ఉండటం ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది.

 

కరోనాను కట్టడి చేయడంలో భాగంగా ఇపటికే పలు కార్పొరేట్ సంస్థలు విరాళాలు ప్రకటించాయి. దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పీఎం సహాయ నిధికి వంద కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించింది. ఎస్బీఐ ఉద్యోగులందరూ తమ రెండు రోజుల వేతనాన్ని కరోనా కట్టడి కోసం పీఎం సహాయ నిధికి అందజేశారు. దాదాపు రెండున్నర లక్షల మంది ఎస్బీఐ లో వివిధ హోదాల్లో పని చేస్తున్నారు.

 

ఎస్బీఐ ఛైర్మన్ రంజీష్ కుమార్ ఎస్బీఐ ఉద్యోగులు తమ రెండు రోజుల జీతాన్ని విరాళంగా ఇచ్చినట్లు ప్రకటన చేశారు. ఎస్బీఐ బ్యాంకు లాభాల్లో 0.25 శాతం పీఎం సహాయనిధికి అందజేస్తున్నట్లు సమాచారం. కరోనా కట్టడి కోసం సినీ ప్రముఖులు, వివిధ ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు విరాళాలను ప్రకటిస్తున్నారు. మరోవైపు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది.

 

ఏపీలో ఒక్కరోజే 67 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో బాధితుల సంఖ్య 111కు చేరింది. ఒక్కరోజే హాఫ్ సెంచరీకి పైగా కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం మరింతగా అప్రమత్తమైంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోను కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాయలసీమలోని అన్ని జిల్లాలలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

e

మరింత సమాచారం తెలుసుకోండి: