ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి ని నివారించడానికి నేషన్ వైడ్ గా లాక్ డౌన్ కొనసాగుతుంది. ఇక కరోనా పై పోరుకు కేంద్రానికి అండగా నిలవడానికి ప్రముఖ పారిశ్రామిక వేత్తలు కోట్లల్లో విరాళాలను ప్రకటిస్తున్నారు. అందులో భాగంగా టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా ఏకంగా 1500కోట్ల విరాళాన్ని ప్రకటించగా రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబానీ 500కోట్లు అదానీ గ్రూప్ 100 కోట్లు, భారతీ గ్రూప్ 100కోట్ల విరాళాలను ప్రకటించాయి. తాజాగా విప్రో సంస్థల అధినేత ,అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ చైర్మన్ అజీమ్ ప్రేమ్ జీ 1125కోట్ల భారీ విరాళాన్ని ప్రధాన మంత్రి సహాయానిధికి అందించారు. దాంతో అజీమ్ పై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా పారిశ్రామిక వేత్తలతో పాటు సినీ , క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు కూడా భారీగా విరాళాలను ప్రకటిస్తున్నారు. 
 
ఇదిలావుంటే దేశంలో కరోనా కేసులు రోజురోజు కు ఎక్కువవుతున్నాయి. దీనికి కారణం ఇటీవల ఢిల్లీ లోని నిజాముద్దీన్ లో జరిగిన మత ప్రార్ధనలు..ఈ ప్రార్థనల కోసం ఇండోనేషియా, గల్ఫ్ నుండి ప్రతినిధులు హాజరైయ్యారు. వారికి కరోనా ఉండడం తో ఈ ప్రార్ధనలకు హాజరైన భారతీయులకు కూడా వైరస్ వ్యాప్తి చెందింది. ఈ ఒక్క రోజే దేశ వ్యాప్తంగా 300కేసులు నమోదు కావడం గమనార్హం. దీనిలో 90 శాతం నిజాముద్దీన్ బాధితులే వున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే నిజాముద్దీన్ లో జరిగిన మత ప్రార్థనలకు సుమారు 1700 మంది ఉభయ రాష్ట్రాల నుండి  హాజరైనట్లు సమాచారం దాంతో ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రా లో కరోనా కేసులు  రోజు రోజుకి పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఆంధ్రాలో 67 కేసులు నమోదుకావడంతో ప్రస్తుతం అక్కడ మొత్తం కరోనా బాధితుల సంఖ్య 111 కుచేరింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: