ప్ర‌పంచ‌మంతా క‌రోనా క‌ష్టాలు మాములుగా లేవు. క‌రోనా వ్యాధిని త‌రిమికొట్ట‌డానికి ఎక్క‌డిక‌క్క‌డ ప్ర‌జ‌లు లాక్‌డ‌వున్‌లో ఉంటున్నారు. దాంతో ప్ర‌భుత్వాలు ఏదైతే ఆంక్ష‌లు విధించిందో వాటిని ప్ర‌తి ఒక్క‌రూ తూచా త‌ప్ప‌కుండా పాటిస్తున్నారు. లేని య‌డ‌ల ఈ వ్యాధి దిన దిన గండంగా పెరుగుతుంది కానీ త‌గ్గే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. దీంతో అన్ని ప్ర‌భుత్వాలు ఎల‌ర్ట్ అయి ఎక్క‌డిక‌క్క‌డ క‌ట్ట‌డి నిర్వ‌హించాయి. తెలంగాణ‌లో ఉద‌యం ఆరు నుంచి సాయంత్రం ఆరు వ‌ర‌కు కొన్ని నిత్య‌వ‌స‌ర వ‌స్తువుల దుకాణాలు తీసినా ఏపీలో మాత్రం కేవ‌లం ఉద‌యం ఆరు నుంచి 10 వ‌ర‌కే దుకాణాలు తీయ‌బ‌డుతున్నాయి. అక్క‌డి ప్ర‌భుత్వం మ‌రి కాస్త ఎక్కువ‌గా నిబంధ‌న‌ల‌ను పాటిస్తుంది.

 

ఇక ఇదిలా ఉంటే... ఓ పక్క నిత్య‌వ‌స‌ర వ‌స్తువులు కూడా దొర‌క‌క కొన్ని ప్రాంతాల్లో ఇబ్బంది ప‌డుతుంటే మ‌రికొంత మంది మందుబాబులు మందు దుకాణాలు లేక నానా తంటాలు ప‌డుతున్నారు. ఇక రోజువారీ కూలీ చేసుకున్న‌వాడి నుంచి ప్ర‌తి ఒక్క‌రూ మందు బానిస‌లుగా మారిన వారంద‌రూ ఇప్పుడు ఆ మందు దొర‌క‌క నానా తంటాలు ప‌డుతున్నారు. ఒక వేళ ఎక్క‌డ‌న్నా బ్లాకులో ఎవ‌ర‌న్నా అమ్మిన్న‌ప్ప‌టికీ అది అత్యంత ఖ‌రీదైన‌దిగా ఉంటుంది. ఏకంగా రెండు, మూడు వేల వ‌ర‌కు ఉంటుంది. అంత అత్యంత ధ‌ర‌లు పెట్టి సామాన్యులు కొన‌లేక‌పోతున్నారు. ఇక రోజు మందు తాగుతూ బానిస‌లుగా మారిన చాలా మంది మందు లేక‌పోయేస‌రికి కొంత మంచి పిచ్చివారైపోతున్నారు. ఒక వారం రోజులుగా హైద‌రాబాద్ ఎర్ర‌గ‌డ్డ పిచ్చి ఆసుప‌త్రిలో దాదాపుగా ఇప్ప‌టికే మ‌తిస్థిమితం లేని పేషంట్లుగా వంద మంచి జాయిన్ అయిన‌ట్లు స‌మాచారం అలాగే ఇంకొంద‌రు ఉరి వేసుకుని మ‌రి కొంత మంది గొంతుకోసుకుని చ‌నిపోతున్నారు. దీని వ‌ల్ల తీవ్ర రోజు రోజుకి క్రైమ్ రేటు పెరుగుతుంది. ఎంతో మంది అమాయ‌కులు చ‌నిపోతున్నారు.

 

దీనికి గ‌వ‌ర‌న్న‌మెంట్ చొర‌వ చేసుకుని ఈ స‌మ‌స్య‌కి ప‌రిష్కారం చూస్తే చాలా బావుంటుంది. క‌నీసం రోజుకు ఒక గంట లేదంటే రెండు గంట‌ల పోలీస్ సెక్యూరిటీతో నైనా స‌రే వారికి కొంత లిమిటెడ్ ప్ర‌కారం రోజుకు ఒక్క‌టైనా స‌రే ఇస్తూ ఉంటే కొన్ని ప్రాణాల‌ను కాపాడుకున్న‌ట్లు అవుతుంద‌ని ఆలోచిస్తే బావుంటుంది. మందుకి బానిస‌లుగా మారిన చాలా మందికి ఏం చేయాలో అర్దం కాక చాలా ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇక దీని వ‌ల్ల ప్ర‌భుత్వానికి కూడా ఆర్ధికంగా కొంత మేర ఇబ్బంది లేకుండా ఉంటుంద‌ని ప‌లువురు భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: